Allu Sirish Open Up On His Relationship In Latest Interview - Sakshi
Sakshi News home page

Allu Sirish About His Relationship: ‘అవును.. వారితో సీరియస్‌ రిలేషన్లో ఉన్నా, కానీ నేనే బ్రేకప్‌ చెప్పా’

Oct 19 2022 3:00 PM | Updated on Oct 19 2022 4:14 PM

Allu Sirish Open Up On His Relationship in Latest Interview - Sakshi

అల్లు హీరో శిరీష్‌ నటించి లేటెస్ట్‌ మూవీ ఊర్వశీవో రాక్షసివో. అను ఇమ్మానుయేల్‌ హీరోయిన్‌. రాకేష్ శశి దర్శకత్వం వహించిన ఈ చిత్రం నవంబర్‌ 4న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ నేపథ్యంలో మూవీ ప్రమోషన్లో భాగంగా శిరీష్‌ ఓ చానల్‌తో ముచ్చటించాడు. ఈ సందర్భంగా మూవీ విశేషాలతో పాటు తన వ్యక్తిగత విషయాలను కూడా పంచుకున్నాడు. ఈ క్రమంలో ప్రేమ, బ్రేకప్‌పై స్పందించాడు. మూవీలో హీరోయిన్‌తో లవ్‌ ట్రాక్‌ గురించి చెబుతుండగా యాంకర్‌ నిజ జీవితంలో కూడా రిలేషన్స్‌లో ఉన్నారా? అని ప్రశ్నించారు.

చదవండి: ‘ఆదిపురుష్‌’ డైరెక్టర్‌కు లగ్జరీ ఫెరారీ కారు బహుమతి, ఎవరిచ్చారంటే..

దీనికి శిరీష్‌ స్పందిస్తూ.. ఈ కాలంలో రిలేషన్స్‌ లేకుండా ఎవరుంటారని, తనకు రెండు మూడు సీరియస్‌ రిలేషన్స్‌ ఉండేవంటూ ఆసక్తికర విషయాలను బయటపెట్టాడు. దీంతో యాంకర్‌ మీరు ఓ పెద్దింటి అమ్మాయితో సీరియస్‌ రిలేషన్‌లో ఉన్నారని, చివరికి మీరే బ్రేకప్‌ చెప్పారని విన్నాను నిజమెంత అని అడగ్గా.. అవును అని సమాధానం ఇచ్చాడు. ‘నాకు గతంలో రెండు మూడు సీరియస్‌ రిలేషన్‌షిప్స్‌ ఉన్నాయి. అయితే వారందరితో నాకు బ్రేకప్‌ అయ్యింది.

చదవండి: ‘బ్రహ్మాస్త్ర’ ఓటీటీ రిలీజ్‌ డేట్‌ ఫిక్స్‌! ఆ రోజు నుంచి స్ట్రీమింగ్‌..

ఆ బ్రేకప్స్‌ వల్ల నేను కూడా బాధపడ్డాను. బ్రేకప్‌ చెప్పడం వల్ల ఎదుటి వాళ్లకు మాత్రమే పెయిన్‌ ఉండదు. చెప్పిన వాళ్లకి కూడా ఉంటుంది. అది ఆ నిమిషం మనకు తెలియదు. కానీ, ఏడాది తర్వాత దాని రిజల్ట్‌ తెలుస్తుంది. బ్రేకప్‌ చెప్పినప్పుడు నేను కూడా బాధపడ్డాను. అనవసరంగా బ్రేకప్ చెప్పి టైం వేస్ట్ చేస్తున్నానేమోనని ఇప్పటికీ అనిపిస్తుంది. లేదంటే ఇపాటికి నాకు పెళ్లి జరిగి ఉండేది కదా’ అని చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం అల్లు శిరీష్‌ కామెంట్స్‌ నెట్టింట వైరల్‌ అవుతున్నాయి. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement