చట్టపరమైన చర్యలు తీసుకోవాల్సి వస్తుంది : శిరీష్‌

Allu Sirish Warns Netizen Over Fake Post - Sakshi

సోషల్‌ మీడియాలో కొందరు ఆకతాయిలు ఫేక్‌ పోస్టులు సృష్టిస్తున్న సంగతి తెలిసిందే. అటువంటి వారిపై చర్యలు తీసుకోవడం కూడా కష్టతరంగా మారింది. తమపై జరుగుతున్న దుష్ప్రచారానికి సంబంధించి పలువురు సెలబ్రిటీలు పోలీసులను ఆశ్రయించిన సందర్భాలు కూడా ఉన్నాయి. తాజాగా సోషల్‌ మీడియాలో ప్రచారంలో ఉన్న ఓ ఫేక్‌ పోస్టుపై హీరో అల్లు శీరిష్‌ ట్విటర్‌ వేదికగా స్పందించారు. ఓ నెటిజన్‌ ట్వీట్‌కు రిప్లై ఇచ్చిన శిరీష్‌.. నకిలీ స్ర్కీన్‌షాట్‌లు పోస్ట్‌ చేసి.. తప్పుడు ప్రచారం చేయవద్దని కోరారు. ఇలాంటి చర్యలకు పాల్పడితే చట్టపరమైన చర్యలు తీసుకోవాల్సి వస్తోందని హెచ్చరించారు. అయితే శిరీష్‌ స్పందించిన వెంటనే.. సదరు నెటిజన్‌ ఆ పోస్ట్‌ను తొలగించాడు. 

నాలుగేళ్ల తర్వాత..
మరో ట్వీట్‌లో అల.. వైకుంఠపురములో మ్యూజిక్‌ నైట్‌కు తను హాజరవుతున్నట్టు చెప్పారు. దాదాపు నాలుగేళ్ల తర్వాత తన సోదరుడి చిత్రానికి సంబంధించిన ఈవెంట్‌కు హాజరవుతున్నట్టు తెలిపారు. 2016 సరైనోడు ఆడియో ఫంక్షన్‌కు హాజరయ్యానని గుర్తుచేశారు. ఈ కార్యక్రమానికి హాజరు అవుతుండటం చాలా సంతోషంగా ఉందన్నారు. కాగా, గౌరవం సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చిన అల్లు శిరీష్‌.. పలు చిత్రాల్లో మెప్పించారు. గతేడాది ఏబీసీడీ చిత్రంతో శిరీష్‌ ప్రేక్షకుల ముందుకు వచ్చారు. పలు అవార్డు ఫంక్షన్‌లకు ఆయన హోస్ట్‌గా కూడా వ్యవహరించారు.

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top