ముంబై: ఇటీవల కురుస్తున్న అకాల వర్షాల కారణంగా రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఆరుగాలం కష్టించి పంట చేతికి వచ్చిన సమయంలో వర్షాలు కురుస్తుండటంతో పంటను కాపాడుకునేందుకు ఎంతో కష్టపడుతున్నారు. తాజాగా వర్షం నీటిలో కొట్టుకుపోతున్న పంటను కాపాడేందుకు ఓ రైతు పడిన కష్టం వీడియో బయటకు వచ్చింది. ఈ వీడియోపై కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ స్పందించారు. ఈ క్రమంలో బాధితుడితో ఫోన్లో మాట్లాడి ధైర్యం చెప్పారు.
వివరాల ప్రకారం.. మహారాష్ట్రకు చెందిన రైతు గౌరవ్ పన్వార్ తన వేరుశనగ పంటను అమ్ముకోవడానికి వాషిమ్ మార్కెట్‌కు తీసుకొచ్చాడు. ఈ సందర్భంగా భారీ వర్షం కురవడంతో పంట నీటిలో కొట్టుకొనిపోయింది. దీంతో రైతు గౌరవ్ భారీ వర్షంలో తడుస్తూనే కొట్టుకుపోతున్న వేరుశనగను కాపాడేందుకు శాయశక్తులా ప్రయత్నించాడు. కానీ, వరద నీటిలో పంట కొట్టుకొనిపోయింది. ఈ హృదయవిదారక వీడియో కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ దృష్టికి రావడంతో.. స్వయంగా ఆయనే బాధిత రైతుకు ఫోన్ చేసి మాట్లాడారు. అండగా ఉంటామని భరోసా ఇచ్చారు.
ఈ సందర్భంగా మంత్రి శివరాజ్ సింగ్ వీడియోను ట్విట్టర్‌లో పోస్టు చేశారు. వీడియోలో మాట్లాడుతూ..‘ఈ విషయం నన్ను చాలా బాధించింది. నష్టపోయిన పంటకు పరిహారం చెల్లిస్తాం. మీరు, మీ కుటుంబ సభ్యులు ఇబ్బందులు పడకుండా చూస్తాం. మహారాష్ట్ర ప్రభుత్వం రైతుల సమస్యలపై చాలా సున్నితంగా వ్యవహరిస్తోంది. దీనిపై సీఎం దేవేంద్ర ఫడ్నవీస్, రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి, జిల్లా కలెక్టర్‌తో మాట్లాడాను. అంతా మంచే జరుగుతుంది’ అని అన్నారు.
▶️ This video will touch your heart.
➡️ Union Minister for Agriculture and Farmers' Welfare and Rural Development, Shivraj Singh Chouhan says - “Seeing Gaurav Panwar’s video shook my heart. I spoke to him and assured support. No farmer will be left unheard - we stand… pic.twitter.com/N96OAq3zNO— Saurabh Dandariyal (@DandariyalUk) May 18, 2025