హైదరాబాద్ ఐటీసీ కోహినూర్‌లో హరిణ్యా రెడ్డితో రాహుల్ సిప్లిగంజ్ ఎంగేజ్‌మెంట్ జరిగింది.
హరిణ్యా రెడ్డి యూసుఫ్‌గూడ సెయింట్ మేరీస్ కాలేజీలో బి.ఎ. మాస్ కమ్యూనికేషన్ ఇన్ జర్నలిజం చదివింది.
తెలుగు బిగ్‌బాస్ షోను నిర్వహించే ఎండేమోల్ షైన్ ఇండియా కంపెనీలో ఆమె ప్రొడ్యూసర్‌గా కూడా పనిచేసింది.
రాహుల్ సిప్లిగంజ్ స్వయంగా నిర్మించే ఆల్బమ్ సాంగ్స్ కోసం నిర్మాత, ప్రొడక్షన్ మేనేజర్‌గా ఆమె పనిచేసింది.
సుమారు 2020 నుంచే వారిద్దరికి పరిచయం ఉంది.
నెల్లూరుకు చెందిన హరిణ్యా రెడ్డి కుటుంబం ప్రస్థుతం రాజకీయాల్లో ఉంది.
టీడీపీ నేత, నుడా ఛైర్మన్ కోటంరెడ్డి శ్రీనివాసులు రెడ్డి అన్న కుమార్తెనే ఈ హరిణ్యా రెడ్డి
నిశ్చితార్థ ఫోటోలను కోటంరెడ్డి శ్రీనివాసులు రెడ్డి కూడా షోషల్‌మీడియాలో పంచుకున్నారు


