
వోల్వర్‌హాంప్టన్: యూకేలోని వోల్వర్‌హాంప్టన్‌లో ఇద్దరు వృద్ధులైన సిక్కు పురుషులపై దాడి జరిగింది. ఈ ఘటనకు సంబంధించిన వీడియో వైరల్‌గా మారింది ఆ వీడియోలో బాధితుల్లో ఒకరు తలపాగా లేకుండా నేలపై పడివున్నట్లు కనిపిస్తోంది.
మీడియాకు అందిన సమాచారం ప్రకారం వోల్వర్‌హాంప్టన్ రైల్వే స్టేషన్ వెలుపల ఈ ఘటన చోటుచేసుకుంది. ఈ ఘటనపై దర్యాప్తు చేపట్టిన పోలీసులు ముగ్గురు నిందితులను అరెస్టు చేశారు. ఆగస్టు 15న జరిగిన ఈ ఘటనను జాతివిద్వేష చర్యగా చెబుతున్నారు. ఈ వీడియోలో ఆ సిక్కు వృద్ధులపై దాడి జరిగినట్లు కూడా కనిపిస్తోంది. ఈ ఘటనను వీడియో తీస్తున్న మహిళ.. ఇద్దరు వ్యక్తులపై తెల్లజాతి వారు దాడి చేస్తున్నారని అని అరవడాన్ని గమనించవచ్చు. అలాగే దాడి చేస్తున్న వారితో మీరు ఏమి చేస్తున్నారు? అని ఆమె అడగటం కూడా వినిపిస్తుంది.
బాధితులను పోలీసులు చికిత్స కోసం ఆస్పత్రికి తరలించారు. అనంతరం డిశ్చార్జ్ చేశారు. ఈ దాడిపై భారత్‌లోని సిక్కు నేతలు, యూకేకి చెందిన సిక్కు హక్కుల సంస్థ సిక్కు సమాఖ్య తీవ్రంగా ఖండించింది. ఇది జాత్యహంకార దాడిగా అభివర్ణించింది. శిరోమణి అకాలీదళ్ నేత సుఖ్‌బీర్ సింగ్ బాదల్ ఈ ఘటనపై స్పందిస్తూ, ఒక సిక్కు వ్యక్తి తలపాగాను బలవంతంగా తొలగించారు. ఈ దాడిని తీవ్రంగా ఖండిస్తున్నానని పేర్కొన్నారు. వెస్ట్ మిడ్‌లాండ్స్ పోలీసులు, యూకే హోం ఆఫీస్ ఈ ఘటనపై వెంటనే స్పందించాలని కోరారు. బ్రిటిష్ ప్రభుత్వంతో ఈ సమస్యపై చర్చించాలని విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్‌కు ఆయన విజ్ఞప్తి చేశారు.
I strongly condemn the horrific attack on two elderly Sikh men in Wolverhampton, UK, during the course of which one Sikh’s turban was removed forcibly.
▪️This racist hate crime targets the Sikh community, which always seeks Sarbat Da Bhala (the well-being of all).
▪️Known for… pic.twitter.com/5G0DJbZbBs— Sukhbir Singh Badal (@officeofssbadal) August 18, 2025