మూడు దశాబ్దాలు బ్రిటన్‌లో ఉంటూ.. అత్యంత ధనవంతులైన బిలియనీర్ల జాబితాలో ఒకరుగా నిలిచిన ఉక్కు వ్యాపారి లక్ష్మీ ఎన్ మిట్టల్ ఆ దేశానికి వీడ్కోలు పలికారు. 30ఏళ్లు యూకేలో ఉన్న ఈయన ఇప్పుడు ఆ దేశాన్ని ఎందుకు వీడారు?, దీనికి కారణం ఏమిటనే వివరాలను ఇక్కడ తెలుసుకుందాం.
2025 'సండే టైమ్స్ రిచ్ లిస్ట్' ప్రకారం ఆర్సెలర్ మిట్టల్ స్టీల్ వర్క్స్ ఫౌండర్ 15.4 బిలియన్ పౌండ్ల ఆస్తిని కలిగి ఉన్నారని అంచనా. దీంతో లక్ష్మీ మిట్టల్ యూకేలో ఎనిమిదవ అత్యంత ధనవంతుడిగా నిలిచారు. అయితే ఇప్పుడు ఈయన దేశాన్ని వీడటానికి ప్రధాన కారణం.. అక్కడి ప్రభుత్వం తీసుకున్న వారసత్వ పన్ను రద్దు నిర్ణయాలే అని తెలుస్తోంది.
ప్రస్తుతం లక్ష్మీ మిట్టల్ స్విట్జర్లాండ్‌లో నివసిస్తున్నారు. తరువాత తాను భవిష్యత్తును దుబాయ్‌లో గడిపే అవకాశం ఉంది. ఎందుకంటే ఆయనకు ఇప్పటికే దుబాయ్‌లో ఒక భవనం ఉంది. అంతే కాకండా ఈయనకు ఐరోపా, అమెరికాలలో కూడా ఆస్తులు ఉన్నట్లు సమాచారం. లండన్‌లోని కెన్సింగ్టన్ ప్యాలెస్ గార్డెన్స్ ప్రాంతంలో ఒక విలాసవంతమైన భవనం కూడా ఉంది.
లక్ష్మీ ఎన్ మిట్టల్
1950 జూన్ 15న రాజస్థాన్‌లో పుట్టిన లక్ష్మీ నారాయణ్ మిట్టల్.. స్టీల్ ఇండస్ట్రీలో తిరుగులేని వ్యక్తిగా ఎదిగారు. స్టీల్ ఉత్పత్తిలో ఆర్సెలర్ మిట్టల్ స్టీల్ ప్రపంచంలోనే రెండో స్థానంలో ఉంది. సుమారు 24 బిలియన్ యూరోల విలువైన ఈ కంపెనీలు లక్ష్మీ ,మిట్టల్ కుటుంబం వాటా 40 శాతం వరకు ఉంది. 2021లో లక్ష్మి మిట్టల్ సీఈఓగ బాధ్యతలు వదులుకున్న తరువాత.. ఆయన కుమారుడు ఆదిత్య మిట్టల్ సీఈఓగా బాధ్యతలు స్వీకరించారు.
భారతదేశంలో పుట్టిన లక్ష్మీ మిట్టల్ 1995లో తన కుటుంబంతో పాటు లండన్‌లో స్థిరపడ్డారు. 30 ఏళ్లుగా అక్కడే ఉన్న వీరు.. అక్కడి ప్రభుత్వం తీసుకున్న వారసత్వ పన్ను రద్దు కారణంగా.. స్విట్జర్లాండ్‌కు మకాం మార్చారు. ఈయన నెట్‌వర్త్ 22 బిలియన్ డాలర్లు.
ఇదీ చదవండి: అంబానీ స్కూల్‌లో ఫీజులు అన్ని లక్షలా?


