మొన్న ‘గిబ్లీ’ నేడు బేబీ పాడ్‌కాస్ట్‌.. | Baby Podcast AI Video Generator Now Trending On Social Media, Know Interesting Deets Inside | Sakshi
Sakshi News home page

మొన్న ‘గిబ్లీ’ నేడు బేబీ పాడ్‌కాస్ట్‌..

Jun 1 2025 1:55 PM | Updated on Jun 1 2025 3:01 PM

Baby Podcast AI Video Generator goes Viral On Socialmedia

సోషల్‌మీడియాలో యుగంలో ప్రతి ఒక్కటీ వింతే.. అన్నట్లు ఉంది. ఇందులో భాగంగా ప్రస్తుతం ఏఐ ఏఐ హవా నడుస్తోంది. రెండు నెలల క్రితం గిబ్లీ ఆర్ట్‌ ఫొటోలతో హోరెత్తిన సోషల్‌మీడియా.. తాజాగా బేబీ పాడ్‌కాస్ట్, బేబీ ఏఐ వీడియోలతో హల్‌చల్‌ చేస్తోంది. నెటిజన్లు బేబీ రూపంలో చేసిన వీడియోలు ప్రస్తుతం నెటిజన్లను ఆకర్షిస్తున్నాయి. 

అంతేకాదు ప్రతి ఒక్కరూ దీనిని ట్రెండ్‌గా ఫాలో అవుతున్నారు. సోషల్‌మీడియాలోని ఇన్‌స్టా, ఫేస్‌బుక్‌లతో పాటు అన్ని యాప్‌లలో బేబీ పాడ్‌కాస్ట్‌ విడియోలే దర్శనమిస్తున్నాయి. సినిమాల్లోని వైరల్‌ సీన్లను బేబీ పాడ్‌ కాస్ట్‌ రూపంలోకి తీసుకొచ్చి సందడి చేస్తున్నారు. 

చాట్‌జీపీటీ ఏఐతో ఈ బేబీ పాడ్‌కాస్ట్‌ వీడియోలు చేస్తున్నారు. సినిమా, పొలిటికల్, నెటిజన్లు చేసిన వీడియోలు దీనికి కేంద్రబిందువుగా మారుతున్నాయి. గిబ్లీ ఆర్ట్‌ చేసిన రచ్చను మించి బేబీ పాడ్‌కాస్ట్‌ చేస్తుందని నెటిజన్ల అభిప్రాయం.  

(చదవండి: ఆసియాలో అతిపెద్ద భూగర్భ లైబ్రరీ..! పైన దేవాలయం..కింద గ్రంథాలయం)

Advertisement
 
Advertisement
Advertisement