
డప్పుల దరువులు.. శివసత్తుల పూనకాలు, పోతు రాజుల విన్యాసాలు.. ఎల్లమ్మ నామస్మరణలు మార్మోగాయి. ఆలయ పుర వీధులు పసుపుమయంగా మారాయి.

మంగళవారం బల్కంపేట ఎల్లమ్మ పోచమ్మ కల్యాణోత్సవం వైభవోపేతంగా జరిగింది. ఉదయం 4 గంటలకు అభిషేక పూజలు, మంగళ వాయిద్యాల నడుమ అమ్మవార్ల ఉత్సవ మూర్తు లను కల్యాణ వేదికపైకి తీసుకువచ్చారు.

ఉత్తరా నక్షత్ర యుక్త అభిజిత్ లగ్న సుముహూర్తంలో వేద పండితుల మంత్రోచ్చారణల మధ్య 11.51 గం టలకు కల్యాణం ఘనంగా నిర్వహించారు. రాష్ట్ర ప్రభుత్వం తరఫున అమ్మవారికి మంత్రులు కొండా సురేఖ, పొన్నం ప్రభాకర్ పట్టు వస్త్రాలు సమర్పిం చారు.

ప్రజలంతా సుఖ సంతోషాలతో ఉండాలని అమ్మవారిని మొక్కుకున్నామని మంత్రులు కొండా సురేఖ, పొన్నం ప్రభాకర్ ఆకాంక్షించారు.

అమ్మవారి కల్యాణ మహోత్సవానికి పలు వురు ప్రముఖులు, భక్తులు భారీ సంఖ్యలో తరలివచ్చారు. ఎమ్మెల్యేలు తలసాని శ్రీని వాస్ యాదవ్, దానం నాగేందర్, మల్లారెడ్డి, ఎంపీ అనిల్ కుమార్ యాదవ్, కలెక్టర్ దాసరి హరిచందన, నగర మేయర్ గద్వాల్ విజయ లక్ష్మి, డిప్యూటీ మేయర్ శ్రీలత, నగర పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్ తదితరులు పాల్గొన్నారు.

బల్కంపేట ఎల్లమ్మ ఆలయ పరిసరాల్లో భక్తుల సందడి



















