
ఇటీవలి కాలంలో నగరం నుంచి శ్రీలంకకు పర్యాటకుల సంఖ్య భారీగా పెరిగిందని, ఆ దేశపు పర్యా టక శాఖ అధికారులు తెలిపారు.

శ్రీలంక టూరిజం ప్రమోషన్ బ్యూరో ఆధ్వర్యంలో నగరంలోని తాజ్ కృష్ణా హోటల్లో మంగళవారం రోడ్ షో నిర్వ హించారు.

ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో చెన్నైలోని శ్రీలంక డిప్యూటీ హైకమిషనర్ హర్ష రూపరత్నే మాట్లాడారు. ఉత్తేజకరమైన, వైవిధ్యమైన హాలిడే గమ్యస్థానంగా శ్రీలంకను ప్రపంచవ్యాప్త పర్యాటకులు గుర్తించారన్నారు.

అరుదైన అనుభూతుల కోసం తమ దేశానికి ఆహ్వానిస్తున్నామని అన్నారు.

శీలంక దేశపు ప్రత్యేక కళలు, సాంస్కృతిక ప్రదర్శనలు అలరించాయి.





