పోరీల ఎంటపోకు ఫ్రెండూ అని పాడుతున్న అల్లు శిరీష్‌ | Mayare Lyrical Song Out From Urvasivo Rakshasivo Movie | Sakshi
Sakshi News home page

Urvasivo Rakshasivo: అల్లు శిరీష్‌ 'మాయారే' సాంగ్‌ విన్నారా?

Oct 17 2022 7:33 PM | Updated on Oct 17 2022 7:33 PM

Mayare Lyrical Song Out From Urvasivo Rakshasivo Movie - Sakshi

ఈ మూవీలో ‘మాయారే’ అంటూ సాగే సెకండ్‌ సింగిల్‌  రిలీజ్ చేశారు. రాహుల్‌ సిప్లీగంజ్‌ ఆలపించిన ఈ పాటను కాసర్య శ్యామ్‌ రచించారు.

భలే భలే మగాడివోయ్, గీత గోవిందం, టాక్సీవాలా, ప్రతిరోజు పండగే, మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్‌ లాంటి ఎన్నో సూపర్ హిట్ సినిమాలను నిర్మించిన GA2 పిక్చర్స్ బ్యానర్‌లో రాబోతున్న నెక్స్ట్‌ మూవీ "ఊర్వశివో రాక్షసివో". అల్లు శిరీష్ హీరోగా నటిస్తున్న ఈ సినిమాకు రాకేష్ శశి దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ చిత్రంలో శిరీష్ సరసన "అను ఇమ్మాన్యూల్" హీరోయిన్‌గా నటించింది.

ఇదివరకే రిలీజ్ చేసిన  "ఊర్వశివో రాక్షసివో" చిత్ర టీజర్ కు, సాంగ్ కు అనూహ్య స్పందన లభించింది. తాజాగా ఈ మూవీలో ‘మాయారే’ అంటూ సాగే సెకండ్‌ సింగిల్‌  రిలీజ్ చేశారు. రాహుల్‌ సిప్లీగంజ్‌ ఆలపించిన ఈ పాటను కాసర్య శ్యామ్‌ రచించారు. అనూప్‌రూబెన్స్,అచ్చు రాజమణి సంగీతం అందించిన ఈ చిత్రం నవంబర్‌ 4న విడుదల కానుంది.

చదవండి: ఒంటరిగా రమ్మన్నాడు, కొలతలు అడిగి నీచంగా

Advertisement
 
Advertisement
Advertisement