అల్లు వారి ‘ఏబీసీడీ’ వాయిదా..! | Allu Sirish ABCD Release Postponed | Sakshi
Sakshi News home page

అల్లు వారి ‘ఏబీసీడీ’ వాయిదా..!

Feb 13 2019 10:13 AM | Updated on Feb 13 2019 10:13 AM

Allu Sirish ABCD Release Postponed - Sakshi

అల్లు ఫ్యామిలీ హీరోగా వెండితెరకు పరిచయం అయిన యువ కథానాయకుడు శిరీష్‌. హీరోగా ప్రూవ్ చేసుకునేందుకు కష్టపడుతున్న ఈ యంగ్ హీరో ప్రస్తుతం  ఏబీసీడీ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు రెడీ అవుతున్నాడు. మళయాలంలో ఘనవిజయం సాధించిన ఏబీసీడీ సినిమాకు రీమేక్‌గా ఈ సినిమా తెరకెక్కుతోంది. ప్రస్తుతం నిర్మాణానంతర కార్యక్రమాలు జరుపుకుంటున్న ఈ సినిమాను ముందుగా మార్చి 1న రిలీజ్‌ చేయనున్నట్టు ప్రకటించారు.

అయితే తాజా సమాచారం ప్రకారం ఏబీసీడీ రిలీజ్‌ వాయిదా పడినట్టు తెలుస్తోంది. ప్రస్తుతం సినిమాలకు అన్‌సీజన్‌ కావటం, మార్చి నెలలో విద్యార్థులు పరీక్షలతో బిజీగా ఉంటారన్న ఉ‍ద్దేశంతో మార్చి నెలాఖరున రిలీజ్ చేసే ఆలోచనలో ఉన్నారట. మార్చి 22న ఏబీసీడీ విడుదలకు ఏర్పాట్లు చేస్తున్నట్టుగా ప్రచారం జరుగుతోంది. సంజీవ్‌ రెడ్డి దర్శకుడిగా పరిచయం అవుతున్న ఈ సినిమాలో శిరీష్‌కు జోడిగా రుక్సర్‌ ధిల్లాన్‌ నటిస్తున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement