‘రిచ్‌గానే పుట్టాను.. రిచ్‌గానే పెరిగాను’

Allu Sirish ABCD Trailer Released By Trivikram - Sakshi

అల్లు వారబ్బాయి అల్లు శిరీష్‌ సరైన హిట్‌ కోసం గత కొన్నేళ్లుగా ప్రయత్నిస్తున్నాడు. చివరగా.. ‘ఒక్క క్షణం’ లాంటి డిఫరెంట్‌ కాన్సెప్ట్‌తో ప్రేక్షకుల ముందుకు వచ్చినా.. ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేకపోయింది. ఈసారి పక్క భాషలో హిట్‌ అయిన ఓ చిత్రం కన్నేశాడీ ఈ హీరో. మళయాలంలో సూపర్‌హిట్‌ అయిన ఈ చిత్రాన్ని ఏబీసీడీ(అమెరికన్‌ బార్న్‌ కన్‌ఫ్యూజ్డ్‌ దేశీ) పేరుతో రీమేక్‌ చేస్తున్నాడు.

ఇప్పటికే ఈ చిత్రం పోస్టర్స్‌, సాంగ్స్‌తో మంచి హైప్‌ను క్రియేట్‌ చేయగా.. తాజాగా మాటల మాంత్రికుడు త్రివిక్రమ్‌ రిలీజ్‌ చేసిన ఈ మూవీ ట్రైలర్‌ సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది. ఇప్పటికే ఈ ట్రైలర్‌ మిలియన్‌ వ్యూస్‌తో దూసుకెళ్తోంది. రుక్సర్‌ థిల్లాన్‌ హీరోయిన్‌గా నటించిన ఈ చిత్రంలో మాష్టర్‌ భరత్‌ ముఖ్యపాత్రను పోషిస్తున్నాడు. ఈ చిత్రానికి సంజీవ్‌ రెడ్డి దర్శకత్వం వహించారు. సురేశ్‌బాబు సమర్పిస్తున్న ఈ చిత్రాన్ని ‘మధుర’ శ్రీధర్, యష్‌ రంగినేని నిర్మించగా.. జుడా శాండీ సంగీతాన్ని సమకూర్చారు.

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top