మర్చిపోలేని రోజు, సోషల్‌ మీడియాను వీడుతున్నా: అల్లు శిరీష్‌ | Allu Sirish Quits Social Media For a Reason | Sakshi
Sakshi News home page

Allu Sirish: మర్చిపోలేని రోజు, సోషల్‌ మీడియాను వీడుతున్నా..

Nov 11 2021 9:54 PM | Updated on Nov 11 2021 10:14 PM

Allu Sirish Quits Social Media For a Reason - Sakshi

'ఈ ఏడాది నవంబర్‌ 11వ తేదీ నాకు చాలా ప్రత్యేకమైంది. నా జీవితంలోనే మర్చిపోలేని రోజు అవుతుంది. ఎందుకనుకుంటున్నారా?..

Allu Sirish: అల్లు వారబ్బాయి అల్లు శిరీష్‌ ప్రస్తుతం 'Prema కాదంట' అనే సినిమాలో నటిస్తున్న విషయం తెలిసిందే. టైటిల్‌తో అందరి దృష్టిని ఆకర్షించిన ఈ హీరో ఈ మూవీ కోసం సిక్స్‌ ప్యాక్‌ బాడీ ట్రై చేసి మెప్పించాడు. ఇదిలా వుంటే తాజాగా ఈ హీరో చేసిన ట్వీట్‌ వైరల్‌గా మారింది. 'ఈ ఏడాది నవంబర్‌ 11వ తేదీ నాకు చాలా ప్రత్యేకమైంది. నా వృత్తిజీవితంలోనే ఇది మర్చిపోలేని రోజు అవుతుంది. ఎందుకనుకుంటున్నారా? అది రానున్న రోజుల్లో నేనే చెప్తాను. అప్పటివరకు కొన్ని కారణాల వల్ల సోషల్‌ మీడియాకు దూరంగా ఉంటాను' అని చెప్పుకొచ్చాడు.

దీనిపై నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు. 'అన్నా లవ్‌ సెట్‌ అయిందా? పెళ్లి కుదిరిందా?' అన్న ప్రశ్నలకు.. 'నేను వృత్తిపరంగా స్పెషల్‌ డే అని మరీ మరీ చెప్పాను సామీ' అని సరదాగా రిప్లై ఇచ్చాడు శిరీష్‌. 'ఏంటన్నా? హాలీవుడ్‌కు వెళ్తున్నావా?' అన్న ప్రశ్నలకు శిరీష్‌.. 'అలాంటి ఆశయాలేమీ నాకు లేవు బ్రో, నా కొత్త సినిమా ఫిక్స్‌ అయింది, కథ నచ్చింది అన్న ఆనందం! నా కెరీర్‌లో ఇది బెస్ట్‌ స్క్రిప్ట్‌ అవుతుందనుకుంటున్నాస అంటూ అసలు మ్యాటర్‌ రివీల్‌ చేశాడు.

Advertisement
 
Advertisement
Advertisement