గూఫీ విషయాలు చెప్పేస్తున్నా.. ‘రా’ కోరుకుంటా..రష్మిక మందన్న కామెంట్స్‌ | Rashmika Mandanna Comments about entering into snap chat | Sakshi
Sakshi News home page

Rashmika: గూఫీ విషయాలు చెప్పేస్తున్నా..‘రా’ కోరుకుంటా..రష్మిక మందన్న కామెంట్స్‌

Jun 30 2025 9:19 PM | Updated on Jun 30 2025 9:21 PM

Rashmika Mandanna Comments about entering into snap chat

ప్రస్తుతం రష్మిక మందన్న అంటే నేషనల్‌ క్రష్‌...మెగాస్టార్‌ చిరంజీవి సైతం తన అభిమానాన్ని దాచుకోలేనంటూ మాట్లాడేంత స్థాయికి ఎదిగిపోయింది. ప్రస్తుతం ఈ సౌత్‌ బ్యూటీ ఏం మాట్లాడినా, ఏం చేసినా సెన్సేషన్‌. వరుస విజయాల ఈ కధానాయిక  పంచుకునే విశేషాల కోసం సోషల్‌ మీడియా నిరంతరం కళ్లు కాయలు కాచేలా ఎదురు చూస్తూ ఉంటుంది. ఈ నేపథ్యంలోనే... రష్మిక మందన్న తొలిసారిగా స్నాప్‌ చాట్‌లోకి అడుగుపెడుతున్నట్టు ప్రకటించింది.

ఫేస్‌బుక్, వాట్సాప్, ఇన్‌స్టాల తర్వాత అదే స్థాయిలో ఇండియన్‌ యువతను ఆకట్టుకుంటున్న స్నాప్‌చాట్‌ లో ఆమె ఖాతా తెరవడం అభిమానులకు మరిన్ని విశేషాలతో కనువిందు చేయడమే అనడంలో సందేహం లేదు. ఈ సందర్భంగా రష్మిక మాట్లాడుతూ ‘‘నేను ఎల్లప్పుడూ కొంచెం ‘రా’ గా( పచ్చిగా)  కొంచెం వాస్తవంగా ఉండగలిగే ప్రదేశాలనే కోరుకుంటాను. అదే క్రమంలో  ఇప్పుడు,  స్నాప్‌చాట్‌లో ప్రవేశించాను. దీని ద్వారా  నా  తెర వెనుక క్షణాలు, నా చిన్న చిన్న ఆనందాలు కూడా పంచుకుంటాను.

అంతేకాదు గూఫీ విషయాలు (చిన్న చిన్న పొరపాట్లు, తడబాట్లు, నవ్వు తెప్పించే చిరు తప్పిదాలు..వగైరా) కూడా. మధ్యలో ఉన్న ప్రతిదాన్ని (నా సోషల్‌ మీడియా బృందం చేసే ముందు కూడా) పంచుకునే సమయం ఇది. మీరు దీన్ని చూస్తుంటే, చాలా ధన్యవాదాలు, అభిమానులు ఇప్పటివరకు ప్రతిదానిలో అక్షరాలా భాగమయ్యారు వారికి ఇంకా ఎక్కువ సమయం అందివ్వడానికి నేను వేచి ఉండలేను.  త్వరలో మిమ్మల్ని కలుస్తాను, నా ప్రేమికులారా ’’అని రష్మిక మందన్న ఈ సందర్భంగా తన ఆనందాన్ని వ్యక్తం చేశారు. సో వేచి చూద్దాం..స్నాప్‌చాట్‌ వేదికగా  ఈ నేషనల్‌ క్రష్‌ సృష్టించే జోష్‌ ఎలా ఉంటుందో...
 

Advertisement
 
Advertisement
Advertisement