 
													ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తమ్ముడు త్వరలోనే పెళ్లి బంధంలోకి అడుగుపెట్టనున్నారు. తాజాగా అల్లు శిరీష్ ఎంగేజ్‌మెంట్ గ్రాండ్‌గా జరిగింది. హైదరాబాద్లో జరిగిన ఈ వేడుకలో శిరీష్- నయనిక ఉంగరాలు మార్చుకున్నారు. ఈ విషయాన్ని అల్లు శిరీష్ సోషల్ మీడియా వేదిక పంచుకున్నారు. ఫైనల్లీ ఎంగేజ్‌మెంట్ విత్ లవ్ ఆఫ్ మై లైఫ్ నయనిక అంటూ క్యాప్షన్ రాసుకొచ్చాడు.
ఈ నిశ్చితార్థ వేడుకకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. ఈ విషయం తెలుసుకున్న అభిమానులు, సినీతారలు అభినందనలు చెబుతున్నారు. కాగా ఇటీవలే వర్షం కారణంగా ఎంగేజ్మెంట్కు అటంకం కలిగిందని అల్లు శిరీష్ సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు. దీంతో ఇవాళ వాతావరణం అనుకూలించడంతో నిశ్చితార్థ వేడుక నిర్వహించారు.
కాగా.. అల్లు అరవింద్ కొడుకుగా, అల్లు అర్జున్ తమ్ముడిగా శిరీష్.. 'గౌరవం' (2013) మూవీతో హీరోగా పరిచయమయ్యాడు. కొత్త జంట, శ్రీరస్తు శుభమస్తు, ఒక్క క్షణం, ఏబీసీడీ, ఊర్వశివో రాక్షసివో, బడ్డీ తదితర చిత్రాలు చేశాడు. ఏడాదిన్నరకాలంగా అతడి నుంచి మరే సినిమా రాలేదు.

 
  
                                                     
                                                     
                                                     
                                                     
                                                     
                         
                         
                         
                         
                        
