
‘‘వెంకీ సార్, సుప్రీత్‌లకు సినిమా పట్ల ఎంతో ప్యాషన్ ఉంది. అందుకే ‘కేడీ: ది డెవిల్’ని గొప్పగా నిర్మించారు. ధృవ నా తమ్ముడులాంటివారు. శిల్పా శెట్టితో ఎప్పుడు పని చేసినా అదే ఎనర్జీ ఉంటుంది. మా ‘కేడీ: ది డెవిల్’ సినిమాకి విజయం అందించాలి’’ అని సంజయ్ దత్ పేర్కొన్నారు. ధృవ సర్జా హీరోగా, రీష్మా నానయ్య హీరోయిన్‌గా ప్రేమ్ దర్శకత్వం వహించిన చిత్రం ‘కేడీ: ది డెవిల్’. సంజయ్ దత్, శిల్పా శెట్టి, నోరా ఫతేహి ముఖ్య పాత్రలు పోషించారు. వెంకట్ కె. నారాయణ నిర్మించిన ఈ సినిమా టీజర్ లాంచ్ ఈవెంట్ హైదరాబాద్‌లో జరిగింది.
సంజయ్ దత్ మాట్లాడుతూ– ‘‘హైదరాబాద్‌తో నాకెంతో అనుబంధం ఉంది. ఎంతో మందితో కలిసి పని చేశాను. ప్రస్తుతం ప్రభాస్ ‘రాజా సాబ్’ సినిమా చేస్తున్నాను. ఆ సెట్‌లో తెలుగు నేర్చుకుంటున్నాను’’ అని పేర్కొన్నారు. ధృవ సర్జా మాట్లాడుతూ–‘‘సంజయ్ దత్, శిల్పా శెట్టి వంటి వారితో పని చేయడం సంతోషంగానే ఉంటుంది. త్వరలో విడుదల కానున్న మా సినిమాని ఆదరించాలని కోరు కుంటున్నాను’’ అన్నారు.
‘‘మా సినిమా అందరికీ నచ్చుతుందని భావిస్తున్నాను’’ అని నమ్మకం వ్యక్తం చేశారు ప్రేమ్. శిల్పా శెట్టి మాట్లాడుతూ– ‘‘నేను నా తొలి చిత్రం హిందీలో కాకుండా తెలుగులో (సాహసవీరుడు సాగరకన్య) చేశాను. ఇప్పుడు చేసిన ఈ ‘కేడీ: ది డెవిల్’లో అన్ని వాణిజ్య అంశాలున్నాయి.. ప్రేక్షకులు ఆదరించాలి’’ అన్నారు. హీరోయిన్ రీష్మా నానయ్య, కేవీఎన్ ్ర΄÷డక్షన్ బిజినెస్ హెడ్ సుప్రీత్ మాట్లాడారు.