పోలీసులకు నిర్మాత ఎస్‌కేఎన్ ఫిర్యాదు.. ది రాజాసాబ్ వల్లేనా? | Tollywood Producer SKN Lodged complaint at Cyber Crime Police station | Sakshi
Sakshi News home page

Producer SKN: నిర్మాత ఎస్‌కేఎన్ ఫిర్యాదు.. ది రాజాసాబ్ వల్లేనా?

Jan 23 2026 8:35 PM | Updated on Jan 23 2026 9:15 PM

Tollywood Producer SKN Lodged complaint at Cyber Crime Police station

ప్రముఖ టాలీవుడ్ నిర్మాత ఎస్‌కేఎన్ పోలీసులను ఆశ్రయించారు. కొందరు తనను లక్ష్యంగా చేసుకుని అవమానపరిచేలా పోస్టులు పెడుతున్నారని ఆరోపించారు. తప్పుదారి పట్టించేలా సోషల్ మీడియాలో ప్రచారం చేస్తున్నవారిపై చర్యలు తీసుకోవాలంటూ సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇలాంటి దురుద్దేశపూరిత చర్యలు గందరగోళం సృష్టించడంతో పాటు ప్రతికూలత వ్యాప్తి చేసేలా ఉన్నాయని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఇలాంటివి వ్యాప్తి  చేసే వారిపై  చట్టపరంగా కఠిన చర్యలు తీసుకోవాలని పోలీసులను కోరారు.

 కాగా.. ఇటీవల ది రాజాసాబ్ మూవీ రిలీజ్ తర్వాత ఎస్‌కేఎన్‌పై సోషల్ మీడియాలో ట్రోల్స్ వచ్చాయి. సినిమా రిలీజ్‌కు ముందు ప్రమోషన్స్‌లో పాల్గొన్న ఎస్‌కేఎన్‌ ఆ తర్వాత కనిపించలేదని విమర్శలు చేశారు. కొందరు సోషల్ మీడియాలో ఎస్‌కేఎన్‌ను టార్గెట్‌ చేస్తూ పోస్టులు పెట్టారు. దీనిపైనే తనపై తప్పుడు ప్రచారం సోషల్ మీడియా హ్యాండిళ్లపై చర్యలు తీసుకోవాలని పోలీసులను ఆశ్రయించినట్లు తెలుస్తోంది. కాగా.. ప్రభాస్- మారుతి కాంబోలో వచ్చిన ది రాజాసాబ్ జనవరి 9న థియేటర్లలో విడుదలైన సంగతి తెలిసిందే. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement