ఈ సంక్రాంతి రేసులో మొదటి విడుదలైన మూవీ ‘ది రాజాసాబ్’.. భారీ అంచనాలతో తెరకెక్కిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద నష్టాలను మిగిల్చింది. మారుతి దర్శకత్వంలో పీపుల్ మీడియా ఫ్యాక్టరీపై నిర్మాత విశ్వప్రసాద్ ఎక్కవ బడ్జెట్‌తో తెరకెక్కించారు. మూవీ కాన్సెప్ట్ బాగున్నప్పటికీ అవసరం లేకున్నా హీరోయిన్స్‌ను ముగ్గురుని తీసుకోవడం.. ముఖ్యంగా ప్రభాస్ ఓల్డ్ గెటప్ ఎపిసోడ్ లేకపోవడంతో మైనస్ అయింది. అయితే, ఫ్యాన్స్ సూచన మేరకు సెకండ్ హాఫ్‌లో కొన్ని సన్నివేశాలు తగ్గించి మరికొన్ని సీన్స్ యాడ్ చేశారు. ఇంతలో మూవీకి జరగాల్సిన నష్టం జరిగిపోయింది.
‘ది రాజాసాబ్’ చిత్రాన్ని సుమారు రూ. 450 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కించారని తెలుస్తోంది. అయితే. ఇప్పటి వరకు రూ. 250 కోట్ల మేరకు మాత్రమే బాక్సాఫీస్ వద్ద కలెక్షన్స్ రాబట్టింది. దీంతో భారీ నష్టాన్ని చూడాల్సి వచ్చింది. రాజాసాబ్ మూవీపై పీపుల్ మీడియా ఫ్యాక్టరీ చాలా ఆశలు పెట్టుకుంది. ఎన్నో డిజాస్టర్ సినిమాలతో దెబ్బతిన్న ఆ సంస్థ ఈ మూవీతో గట్టెక్కుతుందని భావించారు. కానీ, రాజాసాబ్ తెచ్చిన నష్టాలు నిర్మాతను మరింత ఇబ్బందుల్లో పడేశాయి. దీంతో ఆ సంస్థను కాపాడేందుకు ప్రభాస్ ముందుకు వచ్చినట్లు తెలుస్తోంది.
మరో సినిమా ప్లాన్
ఏదైనా ఒక సినిమాతో భారీగా నష్టపోతే సదరు నిర్మాతల్ని హీరోలు ఆదుకోవడం పలు సందర్భాల్లో జరుగుతున్నదే.. ఈ క్రమంలోనే రాజాసాబ్ నష్టాలను భర్తీ చేసేందుకు ప్రభాస్ ముందుకు వచ్చినట్లు సమాచారం. భవిష్యత్‌లో పీపుల్ మీడియా ఫ్యాక్టరీతో మరో సినిమా చేసేందుకు ప్రభాస్ ఓకే చెప్పారని ఇండస్ట్రీలో వినిపిస్తుంది. నిర్మాత విశ్వప్రసాద్‌కు ఆయన మాటిచ్చారట. ప్రస్తుతం ప్రభాస్ లైనప్‌లో ఉన్న సినిమాలు పూర్తి అయిన తర్వాత ఆ ప్రాజెక్ట్ పట్టాలెక్కనుంది. సరైన కథతో పాటు దర్శకుడిని కూడా చూసుకోవాలని ప్రభాస్ సూచించారట.
'స్పిరిట్' హక్కులు
ఇదే సమయంలో స్పిరిట్ మూవీ పంపిణీ హక్కులను మైత్రీ మూవీస్‌తో పీపుల్ మీడియా ఫ్యాక్టరీకి అందేలా ప్రభాస్ చేశారు. అలా రాజాసాబ్ నిర్మాతను కాపాడేందుకు ప్రభాస్ ముందుకు వచ్చినట్లు తెలుస్తోంది. రాజాసాబ్ కోసం ప్రభాస్ పూర్తి రెమ్యునరేషన్‌ను కూడా తీసుకోలేదని టాక్ ఉంది. కేవలం అడ్వాన్స్ రూపంలో కొంత మొత్తం మాత్రమే తీసుకున్నారట. సినిమా విడుదల తర్వాత పరిస్థితి మారిపోవడంతో మిగిలిన పారితోషకం గురించి నిర్మాతతో చర్చించలేదట.


