
ప్రభాస్ హీరోగా మారుతి దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం ‘ది రాజాసాబ్’. ఈ సినిమాలో నిధీ అగర్వాల్ ఓ హీరోయిన్‌గా నటిస్తున్నారు. మాళవికా మోహనన్, రిద్ది కుమార్ ఇతర హీరోయిన్స్ పాత్రల్లో నటిస్తున్నారు. ఆదివారం (ఆగస్టు 17) నిధీ అగర్వాల్ బర్త్ డే సందర్భంగా ‘ది రాజాసాబ్’లోని ఆమె కొత్త పోస్టర్‌ను రిలీజ్ చేశారు మేకర్స్. టీజీ విశ్వప్రసాద్ నిర్మిస్తున్న ఈ చిత్రం తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో త్వరలో విడుదల కానుంది.
దసరాకి టైటిల్: నిధీ అగర్వాల్ లీడ్ రోల్‌లో నటించనున్న కొత్త సినిమా టైటిల్ అనౌన్స్‌మెంట్ ఈ దసరా పండగకి రానుంది. ఎన్. నిఖిల్ కార్తీక్ దర్శకత్వంలో పుప్పల అప్పలరాజు ఈ సినిమాను నిర్మించనున్నారు. ‘‘ఇది హారర్ థ్రిల్లర్ మూవీ. ఈ చిత్రంలో నిధీ అగర్వాల్ ఎవరూ ఊహించని కొత్తపాత్రలో కనిపిస్తారు. ఈపాత్రలో ఆమె కనబరిచే నటన ఆమె కెరీర్‌లో మైల్‌స్టోన్‌లా నిలిచిపోతుంది’’ అని పుప్పల అప్పలరాజు పేర్కొన్నారు. ఇలా రెండు సినిమాల అప్‌డేట్స్‌తో ఫ్యాన్స్‌కు డబుల్ బొనాంజ ట్రీట్ ఇచ్చారు నిధీ అగర్వాల్.