
సోషల్ మీడియాలో ఎప్పటికప్పుడు ఫొటోలు, వీడియోలు వైరల్ అవుతూనే ఉంటాయి. రీసెంట్ టైంలో రిలీజైన పాటలతో పాటు గతంలో రిలీజైన సాంగ్స్, షార్ట్ ఫిల్మ్స్ హల్‌చల్ చేస్తుంటాయి. అలా ఇప్పుడు ఓ క్లిప్ వైరల్ అయిపోతోంది. వీళ్లు ఆ హీరోహీరోయిన్ కదా అని తెలిసి ఆశ్చర్యపోవడం నెటిజన్ల వంతయింది. మరి మీరేమైనా వీళ్లని గుర్తుపట్టారా? మమ్మల్నే చెప్పేయమంటారా?
(ఇదీ చదవండి: శ్రీలీల 'ఏజెంట్ మిర్చి'.. ఏంటి విషయం?)
పైన ఫొటోలో కనిపిస్తున్న ఇద్దరిలో ఒకరు నిహారిక కాగా మరొకరు దినేశ్ నాయుడు. దినేశ్ ఎవరబ్బా అని మీరు ఆలోచిస్తున్నారు కదా! ప్రస్తుతం తెలుగులో హీరోగా సినిమాలు చేస్తున్న విశ్వక్ సేన్ అసలు పేరు దినేశ్ నాయుడు. అప్పట్లో అంటే 11-12 ఏళ్ల క్రితం పలు షార్ట్ ఫిల్మ్స్, ఆల్బమ్ సాంగ్స్ చేశాడు. వాటన్నింటిలోనూ దినేశ్ అనే పేరు కనిపిస్తూ ఉంటుంది. అలా ఇప్పుడు ఓ క్లిప్ వైరల్ అవుతోంది. ఇది పదకొండేళ్ల క్రితం వచ్చిన 'టర్మ్స్ అండ్ కండీషన్స్' పాటలోనిది.
అప్పట్లో నిహారిక కూడా పలు షార్ట్ ఫిల్మ్స్ చేసేది. అలా ఈ పాట కోసం విశ్వక్ సేన్‌తో నటించింది. అప్పటి సాంగ్ క్లిప్ ఇప్పుడు వైరల్ అయ్యేసరికి విశ్వక్ సేన్ ఇంతలా మారిపోయాడా అని నెటిజన్లు సరదాగా కామెంట్స్ పెడుతున్నారు. ప్రస్తుతం విశ్వక్ సేన్ 'ఫంకీ' సినిమా చేస్తుండగా.. నిహారిక యాక్టింగ్ పూర్తిగా పక్కనబెట్టేసి నిర్మాతగా మారిపోయింది. గతేడాది 'కమిటీ కుర్రోళ్లు' మూవీతో హిట్ కొట్టింది. ఇప్పుడు కూడా ఓ ప్రాజెక్ట్ చేస్తోంది. ఏదేమైనా వైరల్ క్లిప్ వల్ల విశ్వక్-నిహారిక జంట సోషల్ మీడియాలో టాపిక్ అయిపోయారు.
(ఇదీ చదవండి: క్షమాపణ చెబుతూ మనోజ్ లెటర్ రాశాడు: మౌనిక)
Idheppudu chesav @VishwakSenActor
😂😂🤣😂🤣😂🤣🤣😂😂😂🤣😂😂🤣#VishwakSen pic.twitter.com/r8cSk1AECD— Karthik Chowdary (@KChowdaryyy) October 13, 2025