ప్రభాస్ నటించిన 'ది రాజాసాబ్' మూవీ నుంచి "దిల్ మాంగే మోర్" పాట లిరికల్ వీడియోను తాజాగా విడుదల చేశారు. మాళవిక మోహనన్ ఫైట్ సీన్‌తో ప్రారంభమయ్యే ఈ సాంగ్ ప్రేక్షకులను మెప్పిస్తుంది. కాసర్ల శ్యామ్, అద్వితీయ ఓజ్జల రాసిన ఈ సాంగ్‌ను నకాష్ అజీజ్ ఆలపించారు. తమన్ సంగీతం అందించారు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ పతాకంపై టి.జి.విశ్వప్రసాద్ నిర్మించిన ఈ మూవీని దర్శకుడు మారుతి తెరకెక్కించారు. తాజాగా విడుదలైన ఈ సాంగ్‌లో మాళవిక మోహనన్ గ్లామర్‌తో పాటు తనదైన స్టైల్లో ఫైట్స్‌తో అదరగొట్టింది.


