'ది రాజాసాబ్' రిజల్ట్‌.. ప్రభాస్‌ ఇమేజ్‌పై ట్రోల్స్‌.. తుఫాన్‌లా తిరిగొస్తాడా? | The Raja Saab Movie Box Office Collections Effect On Prabhas Pan India Market Explained, Read Full Story | Sakshi
Sakshi News home page

'ది రాజాసాబ్' రిజల్ట్‌.. రాబోయే తుఫాన్‌ గురించి హెచ్చరిస్తున్న ఫ్యాన్స్‌

Jan 29 2026 8:55 AM | Updated on Jan 29 2026 10:20 AM

The Raja Saab Movie Collections Effect On Prabhas market

"ది రాజాసాబ్" మూవీకి బాక్సాఫీస్‌ వద్ద సరైన ఫలితం దక్కకపోవడంతో ప్రభాస్‌పై ట్రోలింగ్‌ మొదలైంది. పాన్‌ ఇండియా రేంజ్‌ హీరో మార్కెట్‌ ఇంతేనా అంటూ కొందరు కామెంట్లు చేశారు. అయితే, వాటిని డార్లింగ్‌ ఫ్యాన్స్‌ బలంగానే తిప్పికొడుతున్నారు. తెలుగు పరిశ్రమ కీర్తిని పాన్‌ ఇండియాకు పరిచయం చేసిందే ప్రభాస్‌ అంటూ కౌంటర్‌ ఇస్తున్నారు. ఇప్పటికీ బాహుబలి కలెక్షన్స్‌ రికార్డ్స్‌ పదిలంగానే ఉన్నాయని వారు గుర్తుచేస్తున్నారు. ఒక్క సినిమాతో డార్లింగ్‌ క్రేజ్‌ ఏంతమాత్రం తగ్గదని అంతే రేంజ్‌లో విరుచుకుపడుతూనే రాబోయే కలెక్షన్ల తుఫాన్‌ గురించి హెచ్చరిస్తున్నారు. తమ అభిమాన హీరో ఫుల్లీ లోడెడ్‌ గన్స్‌తో రానున్నాడని హెచ్చరిస్తున్నారు.

"ది రాజాసాబ్" మూవీ ఫలితం వల్ల ప్రభాస్‌ ఫ్యాన్స్‌ కాస్త నిరాశ చెందిన విషయం వాస్తవమే.. దీనిని ప్రభాస్‌ కూడా గుర్తించినట్లు ఉన్నారు. అందుకే తను కీలక నిర్ణయం తీసుకున్నారని తెలుస్తోంది. తన ఫ్యాన్స్‌ను మళ్లీ సంతోషపెట్టేందుకు వరుస ప్రాజెక్ట్‌లను లైన్‌లో పెట్టేందుకు సిద్ధమయ్యారు. దీంతో ఫౌజీ, స్పిరిట్‌ సినిమాలతో పాటు కల్కి సీక్వెల్‌ను కూడా లైన్‌లో పెట్టారు. ఇవన్నీ కూడా పాన్‌ ఇండియా స్థాయిలో రానున్న విషయం తెలిసిందే.  ఏడాది గ్యాప్‌లోనే ప్రభాస్‌ నుంచి రెండు సినిమాలు విడుదల చేయాలని బలంగా ఉన్నారట. అయితే, మొదటగా ఫౌజీ  రానుంది. ఆ తర్వాత స్పిరిట్‌ లైన్‌లో ఉంది. ఈ రెండు చిత్రాల్లో ప్రభాస్‌ పాత్ర చాలా పవర్‌ఫుల్‌గా ఉండనుంది. పాన్‌ ఇండియాను షేక్‌ చేసే స్థాయిలో ఈ సినిమాలు ఉంటాయని ఇండస్ట్రీ అంచనా వేస్తుంది. ఆపై కల్కీ రంగంలోకి రానుంది. ఇలా బిగ్‌ ప్రాజెక్ట్స్‌ వస్తుండటంతో ప్రభాస్‌ మార్కెట్‌కు ఎలాంటి ఇబ్బంది ఉండదనేది సినీ విశ్లేషకుల మాట..‌

రాజాసాబ్‌ కలెక్షన్స్‌ నిరాశ పరిచినా.. ప్రబాస్‌ మార్కెట్ ఎట్టిపరిస్థితిల్లోనూ తగ్గిపోలేదు. అతని స్టార్ పవర్ ఇంకా బలంగానే ఉంది. రాబోయే స్పిరిట్‌ సినిమా ప్రభాస్‌ కెరీర్‌లోనే అతిపెద్ద మార్కెట్‌ను క్రియేట్‌ చేసే ఛాన్స్‌ ఉంది. ప్రభాస్‌కు పాన్ ఇండియా స్థాయిలో భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. అదీ ఒక ఫ్లాప్‌తో అది తగ్గిపోదు. రాజా సాబ్‌కు నష్టాలు రావడంతో తన రెమ్యూనరేషన్‌లో 40% తగ్గించుకున్నారని సమాచారం ఉంది. ఆపై స్పిరిట్‌ మూవీ పంపిణీ హక్కులను కూడా ఆ మూవీ నిర్మాతకు అందేలా ప్రభాస్‌ చేయడం విశేషం. ‘ రాజాసాబ్‌’ ఫలితాన్ని దృష్టిలో పెట్టుకుని వీలైనంత త్వరగా  మళ్లీ తన సినిమాలను వరుసగా బాక్సాఫీస్‌ వద్దకు తీసుకురావాలని డార్లింగ్‌ కూడా ఫుల్‌ క్లారిటీతో ఉన్నారట.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement