ప్రభాస్ హీరోగా నటించిన పాన్ ఇండియా సినిమా 'ది రాజా సాబ్' నుంచి మరో వీడియో సాంగ్‌ను మేకర్స్ విడుదల చేశారు. మారుతి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం సంక్రాంతి కానుకగా విడుదలైన విషయం తెలిసిందే..అయితే, అనుకున్నంత రేంజ్‌లో ప్రేక్షకులను మెప్పించలేదు. ఫ్యాన్స్‌ను బాగా ఆకట్టుకున్న 'రెబల్ సాబ్' సాంగ్ వీడియో వర్షన్‌ను విడుదల చేశారు. ఈ సాంగ్ ఆడియో వర్షన్ విడుదలైన తొలి 24 గంటల్లో ఈ పాటకు దాదాపు 14.92 మిలియన్ వ్యూస్, 335.4K లైక్స్ వచ్చాయి. రామజోగయ్య శాస్త్రి రచించిన ఈ సాంగ్‌ను సంజిత్ హెగ్డే, బ్లేజ్ ఆలపించారు. తమన్ సంగీతం అందించారు.


