పాన్ ఇండియా స్టార్ ప్రభాస్(Prabhas) షెడ్యూల్ ఇప్పుడు చాలా బిజీగా ఉంది. ఆయన నటించిన ది రాజాసాబ్ సినిమా విడుదలకు సిద్ధంగా ఉంది. మరోవైపు హను రాఘవపూడి దర్శకత్వంలో ‘పౌజీ’(Fauzi) సినిమా చేస్తున్నాదు. దీంతో పాటు సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో స్పిరిట్ చేయబోతున్నాడు. మరోవైపు సలార్, కల్కి చిత్రాలకు సీక్వెల్స్ కూడా చేయబోతున్నాడు. ఇంత బిజీగా ఉన్న ప్రభాస్.. తాజాగా మరో సీక్వెల్కి కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడట. అదే ది రాజాసాబ్ 2.

మారుతి స్టైల్ నచ్చి..
మారుతి దర్శకత్వంలో ప్రభాస్ ‘ది రాజాసాబ్’(The Raja Saab) సినిమా చేశాడు. ఇప్పటికే షూటింగ్ అంతా కంప్లీట్ అయిపోయింది. పోస్ట్ ప్రొడక్షన్స్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. సంక్రాంతి కానుకగా వచ్చే ఏడాది జనవరి 9న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. అయితే ఈ చిత్రానికి సీక్వెల్ ఉంటుందని గతంలో వార్తలు వచ్చాయి. నిర్మాత టీజీ విశ్వప్రసాద్ కూడా సీక్వెల్పై స్పష్టత ఇచ్చాడు. ‘రాజాసాబ్ 2’ ఉంటుందని.. కాకపోతే ఇది తొలి భాగానికి కొనసాగింపులా ఉండదని.. థీమ్, సెటప్ ఒకే తరహాలో ఉంటాయని ఓ ప్రెస్మీట్లో ఆయన చెప్పారు. అయితే అప్పటికీ మారుతి కథ సిద్ధం చేయలేదు. కానీ ప్రభాస్ మాత్రం మారుతితో మరోసారి పని చేయడానికి ఆసక్తి చూపించాడట. దీంతో మారుతి ఇటీవల రాజాసాబ్ 2 స్టోరీకి సంబంధించిన లైన్ని ప్రభాస్కి చెప్పాడట. అది బాగా నచ్చడంతో ‘చేసేద్దాం డార్లింగ్’అని ప్రభాస్ చెప్పినట్లు సమాచారం.

రెండేళ్ల వరకు ఆగాల్సిందే..
ప్రభాస్ ఇప్పుడు పౌజీ షూటింగ్లో బిజీగా ఉన్నాడు. ఈ సినిమా షూటింగ్ కంప్లీట్ కాగానే..వెంటనే ‘స్పిరిట్’చిత్రాన్ని సెట్స్పైకి తీసుకెళ్లబోతున్నాడు. వచ్చే ఏడాది ఫిబ్రవరిలో ఈ సినిమా షూటింగ్ ప్రారంభం కానుందట. ఆ తర్వాత సలార్ 2 లేదా కల్కి 2 చిత్రాన్ని సెట్స్పైకి తీసుకెళ్లాలి. ఇవన్నీ పూర్తయ్యేవరకు దాదాపు రెండేళ్లు పడుతుంది. ఆ తర్వాతే ప్రభాస్ మరో కొత్త సినిమాని ప్రారంభించాల్సి ఉంటుంది. ఒకవేళ నిజంగానే రాజాసాబ్ సీక్వెల్ ఉన్నా.. రెండేళ్ల తర్వాత దాన్ని సెట్స్పైకి తీసుకెళ్లాల్సి ఉంటుంది. ప్రభాస్తో సినిమా కాబట్టి మారుతి కచ్చితంగా ఆగుతాడు. అందులో నో డౌట్. ది రాజాసాబ్ రిలీజ్ తర్వాత రిజల్ట్ని బట్టి పార్ట్ 2 ఉంటుందా లేదా అనేది క్లారిటీ వస్తుంది.


