
వచ్చే సంక్రాంతి పండక్కి రాజా సాబ్ థియేటర్స్‌కు రానున్నాడా? అంటే అవుననే సమాధానమే ప్రస్తుతం ఫిల్మ్‌నగర్ సర్కిల్స్‌లో వినిపిస్తోంది. ప్రభాస్ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘ది రాజా సాబ్’. ఈ హారర్ కామెడీ ఫ్యాంటసీ సినిమాలో నిధీ అగర్వాల్, మాళవికా మోహనన్, రిద్దీ కుమార్ హీరోయిన్లుగా నటిస్తుండగా, సంజయ్ దత్ ఓ కీలక పాత్రలో నటిస్తున్నారు.
మారుతి దర్శకత్వంలో టీజీ విశ్వప్రసాద్ నిర్మిస్తున్న ఈ సినిమా చిత్రీకరణ ప్రస్తుతం హైదరాబాద్‌లో జరుగుతోంది. ప్రభాస్ పాల్గొంటుండగా కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. కాగా ఈ సినిమాను డిసెంబరు 5న రిలీజ్ చేయనున్నట్లుగా ఇటీవల మేకర్స్ ప్రకటించిన సంగతి గుర్తుండే ఉంటుంది. కానీ రిలీజ్ వాయిదా పడే అవకాశాలు ఉన్నాయని భోగట్టా. వచ్చే ఏడాది సంక్రాంతి సందర్భంగా జనవరి 9న రిలీజ్ చేయాలనే ఆలోచనలో మేకర్స్ ఉన్నారన్నది తాజా టాక్. ఈ విషయంపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.
