మారుతికి అండగా ప్రభాస్‌.. పెద్ద సంస్థతో సినిమా | Prabhas Big Help To Director Maruthi After The Raja Saab Movie Flop, Check Out Interesting Details Inside | Sakshi
Sakshi News home page

మారుతికి అండగా ప్రభాస్‌.. పెద్ద సంస్థతో సినిమా

Jan 30 2026 12:51 PM | Updated on Jan 30 2026 1:14 PM

Prabhas Big Help to the raja saab director maruthi

దర్శకుడు మారుతి ఇటీవల ప్రభాస్‌తో తెరకెక్కించిన హారర్-కామెడీ చిత్రం 'ది రాజాసాబ్' పెద్దగా ప్రేక్షకులను మెప్పించలేదు. దీంతో డార్లింగ్‌ ఫ్యాన్స్‌ మారుతిపై విరుచుకుపడుతున్నారు. సినిమా విడుదలకు ముందు మారుతిని నెత్తిన పెట్టుకున్న వారే ఇప్పడు ట్రోలింగ్‌కు దిగారు. ఒక సినిమా ఫలితంలో దర్శకుడి పాత్ర కాస్త ఎక్కువగానే ఉన్నప్పటికీ మరీ ఇంతలా టార్గెట్‌ చేయడం ఏంటి అంటూ సోషల్‌మీడియాలో కొందరు అభిప్రాయపడుతున్నారు.  ఈ క్రమంలోనే మారుతి కోసం ఏదైనా చేయాలనే ప్రభాస్‌ ప్లాన్‌ ఉన్నట్లు తెలుస్తోంది. దీంతో తన ఫ్యాన్స్‌తో ఉన్న వైరాన్ని కాస్త తగ్గించాలని ఆయన ఉన్నారట.

రాజాసాబ్‌ ఫలితం తర్వాత తన వంతు బాధ్యతగా మారుతి కోసం అండగా నిలవాలని ప్రభాస్‌ అనుకున్నారట. అందుకు సంబంధించిన పనులు కూడా ప్రభాస్‌ పూర్తి చేశారు. మారుతి కొత్త సినిమాకి తనవంతుగా ప్రభాస్‌ సాయం చేసేందుకు ముందుకొచ్చాడు.  హోంబలే ఫిల్మ్స్ బ్యానర్‌లో మారుతి తర్వాతి సినిమాకు లైన్‌ క్లియర్‌ చేశాడు. కథ, సరైన హీరోను ఎంపిక చేసుకోవాలని అడ్వాన్స్‌ కూడా ఇప్పించడం జరిగిపోయింది. ఒక మిడ్‌ రేంజ్‌ హీరో ఎంపిక కోసం మారుతి వేట మొదలైంది. స్క్రిప్ట్ రెడీ అయితే.. మారుతి అనుకున్న హీరోతో మాట్లాడేందుకు కూడా ప్రభాస్‌ సాయం చేయనున్నట్లు తెలుస్తోంది. ఈ విధంగా తన దర్శకుడికి అండగా నిలివాలని ప్రభాస్‌ ఉన్నారు. ఇప్పటికే రాజాసాబ్‌ నిర్మాత నుంచి 40 శాతం రెమ్యునరేషన్‌ తీసుకోలేదని వార్తలు వచ్చిన విషయం తెలిసిందే.

ఏర్పాట్లు అన్ని పూర్తి అయితే, మారుతి ప్రాజెక్ట్‌ ఓపెనింగ్స్‌కు కూడా ప్రభాస్‌ వచ్చే ఛాన్స్‌ ఉంది. దీంతోనైనా డార్లింగ్‌ ఫ్యాన్స్‌తో మారుతి వివాదం ఫుల్‌ స్టాప్‌ పడుతుందని చెప్పొచ్చు. మారుతి తర్వాత సినిమా గురించి ఇప్పటికే వార్తలు వస్తున్నాయి.  మెగా హీరో వరుణ్ తేజ్‌తో తన తదుపరి ప్రాజెక్ట్‌ను ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement