
హీరో ప్రభాస్, డైరెక్టర్ పూరి జగన్నాథ్ కాంబినేషన్‌లో వచ్చిన ‘బుజ్జిగాడు’(2008), ‘ఏక్ నిరంజన్’(2009) సినిమాలు మంచి విజయం అందుకున్నాయి. వీరి కాంబినేషన్‌లో ముచ్చటగా మూడో సినిమా రానుందంటూ గత కొన్నాళ్లుగా వార్తలు వినిపిస్తూనే ఉన్నాయి. అయితే ఈ వార్తలపై ఇటు ప్రభాస్ కానీ, అటు పూరి జగన్నాథ్ కానీ ఎక్కడా స్పందించ లేదు. ‘బాహుబలి’ సినిమా తర్వాత వరుసపాన్ ఇండియా సినిమాలతో దూసుకెళుతున్నారు ప్రభాస్. ప్రస్తుతం ఆయన ‘ది రాజా సాబ్’, ‘ఫౌజి’(వర్కింగ్ టైటిల్) అనే సినిమాల్లో నటిస్తున్నారు.
ఇక విజయ్ సేతుపతి హీరోగా ఓ చిత్రం తెరకెక్కిస్తున్నారు పూరి జగన్నాథ్. కాగా ప్రభాస్ హీరోగా మారుతి దర్శకత్వం వహిస్తున్న చిత్రం ‘ది రాజా సాబ్’. నిధీ అగర్వాల్, మాళవికా మోహనన్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ పతాకంపై టీజీ విశ్వప్రసాద్ నిర్మిస్తున్న ఈ సినిమా డిసెంబరు 5న విడుదలకానుంది. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ హైదరాబాద్ సమీపంలోని అజీజ్‌నగర్‌లో జరుగుతోంది. ఈ సినిమా సెట్స్‌లోకి పూరి జగన్నాథ్, నిర్మాత చార్మీ కౌర్ ఎంట్రీ ఇచ్చారు. ప్రభాస్, పూరి, చార్మీ కలిసి మాట్లాడుకుంటున్న ఈ ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.
రాజా సాబ్‌తో పూరి సాబ్ అంటూ నెటిజన్స్ సరదాగా కామెంట్లు పెడుతున్నారు. పుట్టినరోజు ప్రత్యేకం... ‘ది రాజా సాబ్’ సినిమాలో బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ కీలకపాత్రలో నటిస్తున్న సంగతి తెలిసిందే. మంగళవారం(జూలై 29) ఆయన పుట్టినరోజు. ఈ సందర్భంగా ఆ చిత్రం నుంచి సంజయ్ దత్ ప్రత్యేక ΄ోస్టర్‌ను రిలీజ్ చేశారు మేకర్స్.