‘నన్ను పెళ్లి చేసుకో’ అని కోరిన అభిమాని.. హీరోయిన్‌ ఫన్నీ రిప్లై | Malavika Mohanan Funny Reply To Netizen Who Proposed Her | Sakshi
Sakshi News home page

‘నన్ను పెళ్లి చేసుకుంటావా?’ ..అభిమాని రిక్వెస్ట్‌కి హీరోయిన్‌ ఫన్నీ రిప్లై

Jun 19 2025 5:32 PM | Updated on Jun 19 2025 6:02 PM

Malavika Mohanan Funny Reply To Netizen Who Proposed Her

‘నన్ను పెళ్లి చేసుకుంటావా?’ అని ఓ అమ్మాయిని ఓ అబ్బాయి డైరెక్ట్‌గా అడిగితే తడబడే అమ్మాయిలే ఎక్కువగా ఉంటారు. కానీ మాళవికా మోహనన్‌లాంటి అమ్మాయిలైతే అదే స్పీడుతో సమాధానం ఇచ్చేస్తారు. సరదాగా సోషల్‌ మీడియాలో ఫ్యాన్స్‌తో కబుర్లు చెప్పాలనుకున్నారు ఈ బ్యూటీ. అభిమానులు అడిగిన ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చారు.

ఓ అభిమాని ‘నన్ను పెళ్లి చేసుకుంటారా’ అని అడిగాడు... అంతే... ‘నాకు దెయ్యాలంటే భయం’ అని సూటిగా సుత్తి లేకుండా చెప్పేశారు మాళవిక. అలా ఎందుకు చెప్పారంటే, అతని ‘ఎక్స్‌’ ఖాతా పేరు ‘ఘోస్ట్‌’ అని ఉంది. ఆ పేరుని వాడుకుని, ఇలా సరదాగా మాళవిక చెప్పారు.    

రెబల్ స్టార్ ప్రభాస్ "రాజా సాబ్"తో టాలీవుడ్ ఎంట్రీ ఇస్తోంది మాళవిక. రీసెంట్ గా రిలీజైన ఈ సినిమా టీజర్ లో మాళవిక స్టన్నింగ్ లుక్స్, బ్యూటిఫుల్ అప్పీయరెన్స్ ఆడియెన్స్ ను ఆకట్టుకుంది.  ఈ చిత్రం గురించి కూడా సోషల్‌ మీడియా వేదికగా స్పందించింది.  టీజర్ కు వస్తున్న రెస్పాన్స్ తో హ్యాపీగా ఫీలవుతున్నట్లు ఆమె తెలిపింది. ప్రభాస్ ను ఫస్ట్ టైమ్ సెట్స్ లో కలిసిన సందర్భాన్ని స్పెషల్ మూవ్ మెంట్ గా తాను ఫీలైనట్లు  మాళవిక తెలిపింది. ప్రభాస్ ఎంతో గౌరవంగా, స్నేహంగా ఉంటారని, బాగా మాట్లాడతారని ఆమె పేర్కొంది.

Advertisement
 
Advertisement
Advertisement