డార్లింగ్ ప్రభాస్ తొలిసారి హారర్ జానర్‌లో నటించిన చిత్రం ది రాజాసాబ్. ఈ సినిమాలో నిధి అగర్వాల్, రిద్ది కుమార్, మాళవిక మోహనన్ హీరోయిన్లుగా నటించారు. ఇటీవల ఈ సినిమా నుంచి సహన సహనా అనే లిరికల్ సాంగ్ విడుదల చేశారు. తాజాగా సహనా సహనా ఫుల్ వీడియో సాంగ్ వదిలారు. 'సహనా సహనా నా సఖి సహనా.. కలలో నిన్నే చూశానా..' అన్న లిరిక్స్‌తో పాట మొదలవుతుంది.
తమన్ అందించిన ఈ ట్యూన్‌కు కృష్ణకాంత్ లిరిక్స్ రాశాడు. సింగర్ విశాల్ మిశ్రా ఆలపించాడు. ఈ పాటలో ప్రభాస్.. నిధి అగర్వాల్‌తో రొమాంటిక్ స్టెప్పులేశాడు. ఇక సినిమా విషయానికి వస్తే జనవరి 9న విడుదలైన రాజాసాబ్ దాదాపు రూ.250 కోట్లు వసూలు చేసింది. మారుతి దర్శకత్వం వహించిన చిత్రాన్ని పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌పై టీజీ విశ్వప్రసాద్ నిర్మించాడు.


