7 సినిమాలు.. రూ. 1000 కోట్ల బడ్జెట్‌.. నిర్మాతల ధైర్యం ఏంటి? | The Raja Saab To Mana Shankar Varaprasad, Budget Details Of Upcoming Movie Releases In Sankranti Festival 2026 | Sakshi
Sakshi News home page

Sankranti Movies Budgets: సంక్రాంతి బడ్జెట్‌ రూ. 1000 కోట్లు.. అలా అయితే భారీ నష్టాలే!

Jan 4 2026 4:37 PM | Updated on Jan 4 2026 5:51 PM

The Raja Saab To Mana Shankar Varaprasad, Budget Details Of Releasing Movies In Sankranti

టాలీవుడ్‌కి సంక్రాంతి అతి పెద్ద సీజన్‌. ప్రతిసారి మూడు,నాలుగు సినిమాలు ఈ పండక్కి రిలీజ్‌ అవుతుంటాయి. కానీ ఈ సారి మాత్రం ఏకంగా 7 సినిమాలు(డబ్బింగ్సినిమాలతో కలిసి) రిలీజ్అవుతున్నాయి. చిరంజీవి, ప్రభాస్‌, రవితేజ లాంటి స్టార్హీరోలతో పాటు శర్వానంద్‌, నవీన్పొలిశెట్టి లాంటి కుర్ర హీరోలు కూడా బాక్సాఫీస్బరిలో ఉన్నారు. భోగి, సంక్రాంతి, కనుమ ..ఇలా మూడు రోజులకు మూడు సినిమాలతో పాటు ఆ ముందూ వెనుక కూడా కొత్త సినిమాలు రిలీజ్అవుతున్నాయి. అయితే ఒకే సారి ఇన్ని సినిమాలు వస్తే... ప్రేక్షకుల అన్నీ చూడగల్గుతారా? అంటే కచ్చితంగా నో అనే చెప్పాలి.

వ్యక్తి తన ఫ్యామిలీతో కలిసి ఏడు సినిమాలు చూస్తే.. తక్కువలో తక్కువ 10-12 వేలు ఖర్చు అవుతుంది. పండగకు ఇంట్లో అయ్యే ఖర్చు అదనం. సగటు ప్రేక్షకుడు ఇంత భరించడం కష్టం. విషయం సినిమాలు రిలీజ్చేస్తున్న నిర్మాతలకు కూడా తెలుసు. కానీ పండక్కి క్లిక్అయితే భారీగా రాబట్టుకోవచ్చనే ఆశతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు.

 మొత్తం ఏడు సినిమాల బడ్జెట్దాదాపు రూ. 1000 కోట్ల పైనే ఉంటుంది. వాటిల్లో అత్యధికంగా రాజాసాబ్కి రూ. 500 కోట్ల వరకు ఖర్చు అయినట్లు తెలుస్తుంది. తర్వాత చిరంజీవి మన శంకర్వరప్రసాద్సినిమాకు కూడా రూ. 200 కోట్లకు పైగా ఖర్చు అయిందట. రవితేజభర్త మహాశయులకు విజ్ఞప్తి’, నవీన్‌ ‘అనగనగ రాజు’, శర్వానంద్నారీ నారి మురారి చిత్రాలన్నీ ఒక్కోటి రూ. 100 కోట్లకు పైగా బడ్జెట్తో తెరకెక్కినవే.

 ఇక డబ్బింగ్సినిమాలు జననాయక్‌, పరాశక్తి కూడా భారీ బడ్జెట్చిత్రాలే. మొత్తంగా చిత్రాల బడ్జెట్మొత్తం రూ. 1000 కోట్లు దాటింది. నిర్మాతలకు సేఫ్జోన్లోకి వెళ్లాలంటే..కనీసం రూ. 1500 కోట్ల కలెక్షన్స్రాబట్టాలి. ఇది అసాధ్యం అనే చెప్పాలి. టాక్తో సంబంధం లేకుండా ప్రభాస్‌, చిరంజీవి సినిమాలకు తొలిరోజు భారీ కలెక్షన్సే వస్తాయి

హిట్టాక్వస్తే.. రెండు చిత్రాలు భారీగానే వసూలు చేస్తాయి. కానీ మిగిలిన సినిమాల పరిస్థితి అలా కాదు. సినిమా రిలీజ్అయి.. సూపర్హిట్టాక్వస్తే తప్ప.. ప్రేక్షకులకు థియేటర్స్కి వెళ్లరు. టాక్ని బట్టి వాటి కలెక్షన్స్ఉంటాయి. మరి సంక్రాంతికి బాక్సాఫీస్విన్నర్గా ఎవరు నిలుస్తారనేది మరికొద్ది రోజుల్లో తెలుస్తుంది.

సంక్రాంతికి రిలీజ్అయ్యే సినిమాలివే

  1. ది రాజా సాబ్’ (జనవరి 9)

  2. జననాయకుడు(జనవరి 9)

  3. పరాశక్తి(జనవరి 10)

  4. మన శంకర్‌ వరప్రసాద్‌ గారు(జనవరి 12)

  5. భర్త మహాశయులకు విజ్ఞప్తి(జనవరి 13)

  6. అనగనగ ఓరాజు(జనవరి 14)

  7. నారి నారి నడుమ మురారి(జనవరి 14)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement