breaking news
Anaganaga Oka Raju Movie
-
ఎట్టకేలకు ఓటీటీలో 'అనగనగా ఒక రాజు'.. అఫీసియల్ ప్రకటన
నవీన్ పొలిశెట్టి హీరోగా దర్శకుడు మారి తెరకెక్కించిన చిత్రం 'అనగనగా ఒక రాజు'. ఇందులో హీరోయిన్గా మీనాక్షి చౌదరి నటించారు. సంక్రాంతి కానుకగా విడుదలైన ఈ చిత్రం ఇప్పుడు ఓటీటీలోకి రానుంది. ఈమేరకు అధికారికంగా ప్రకటన వచ్చేసింది. బాక్సాఫీస్ వద్ద రూ. 100 కోట్ల క్లబ్లో చేరిన ఈ మూవీ కోసం ఫ్యాన్స్ ఆసక్తిగానే ఎదురుచూస్తున్నారు. సితార ఎంటర్టైన్మెంట్స్ నిర్మించిన ఈ చిత్రానికి మిక్కీ జే మేయర్ సంగీతం అందించారు.థియేటర్ రన్ పూర్తి చేసుకున్న 'అనగనగా ఒక రాజు'(Anaganaga Oka Raju) మూవీ నెట్‌ఫ్లిక్స్(Netflix)లో విడుదల కానుంది. ఫిబ్రవరి 11న స్ట్రీమింగ్ కానుందని యాప్‌లో ఆ ఓటీటీ సంస్థ పేర్కొంది. నవీన్ పొలిశెట్టి కామెడి పంచ్‌లకు ఫిదా అయిన ప్రేక్షకులు మరోసారి ఈ మూవీని చూసేందుకు ఆసక్తి చూపుతున్నారు. ఫిబ్రవరి 13న ఓటీటీలోకి ఈ మూవీ రానుందంటూ పెద్ద ఎత్తున సోషల్‌మీడియాలో ప్రచారం జరిగింది. అయితే, అంతకంటే ముందుగానే ఈ మూవీ ఓటీటీలోకి రానుంది.కథేంటంటే..గౌరపురం జమీందారు గోపరాజు గారి మనవడు రాజు(నవీన్ పొలిశెట్టి)కి ‘జమీందారు’ అనే ట్యాగ్ తప్ప చేతిలో చిల్లి గవ్వ ఉండదు. ఉన్న ఆస్తులన్నీ తాత పరాయి స్త్రీలకు పంచడంతో పెద్ద పేరున్న పేదవాడిగా జీవితం గడుపుతుంటాడు. తన స్నేహితుడు ఒకడు ధనవంతుల అమ్మాయిని పెళ్లి చేసుకొని సెట్ అవ్వడంతో.. తాను కూడా బాగా డబ్బున్న అమ్మాయినే వివాహం చేసుకోవాలనుకుంటాడు. పెద్దపాలెం గ్రామానికి చెందిన భూపతి రాజు(రావు రమేశ్) బాగా రిచ్ అని తెలుసుకొని.. అతని కూతురు చారులత(మీనాక్షి చౌదరి)ని ప్రేమలో పడేస్తాడు. తాను కూడా బాగా ధనవంతుడని నమ్మించి.. పెళ్లి చేసుకుంటాడు. మొదటి రాత్రి రోజు రాజుకి ఓ షాకింగ్ న్యూస్ తెలుస్తుంది. అదేంటి? రాజు అనుకున్నట్లుగా భూపతి రాజు ఆస్తులన్నీ ఆయన చేతికి వచ్చాయా? చారులత కూడా రాజుని ఎందుకు ప్రేమించింది? జమీందారు అయిన రాజు.. పెద్దపాలెం ప్రెసిడెంట్‌గా ఎందుకు పోటీ చేయాల్సి వచ్చింది? ఎర్రిరాజు(తారక్ పొన్నప్ప)తో నవీన్‌కు ఎందుకు వైర్యం ఏర్పడింది? అనేది తెలియాలంటే సినిమా చూడాల్సిందే.. -
హీరో ఎవరనేది పట్టించుకోను : మీనాక్షి చౌదరి
‘నా దృష్టిలో కథే హీరో. కథ ఎలా ఉంది?, దర్శకుడు ఆ కథను, అందులోని పాత్రలను ఎలా చూపించబోతున్నారు అనేది ఆలోచిస్తాను. హీరో ఎవరనేది ముఖ్యం కాదు. కథకు, పాత్రకు ప్రాధాన్యం ఇస్తాను. ఈ పాత్ర నా కెరీర్ కి ఎలా ఉపయోగపడుతుంది అనేది మాత్రమే చూస్తాను’ అన్నారు యంగ్ బ్యూటీ మీనాక్షి చౌదరి. మీనాక్షి చౌదరి, నవీన్ పొలిశెట్టి జంటగా నటించిన తాజా చిత్రం ‘అనగనగా ఒక రాజు’. ఈ చిత్రాన్ని సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్చూన్ ఫోర్ సినిమాస్ పతాకాలపై సూర్యదేవర నాగ వంశీ, సాయి సౌజన్య నిర్మిస్తుండగా, శ్రీకర స్టూడియోస్ సమర్పిస్తోంది. నూతన దర్శకుడు మారి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రానికి మిక్కీ జె మేయర్ సంగీతం అందిస్తున్నారు. జనవరి 14న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో తాజాగా మీనాక్షి మీడియాతో ముచ్చటించారు. ఆ విశేషాలు..⇢ గుంటూరు కారం, సంక్రాంతికి వస్తున్నాం, అనగనగా ఒక రాజు ఇలా వరుసగా సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు రావడం చాలా చాలా సంతోషంగా ఉంది. గతేడాది 'సంక్రాంతికి వస్తున్నాం'తో మరిచిపోలేని సంక్రాంతి విజయాన్ని అందుకున్నాను. ఇప్పుడు 'అనగనగా ఒక రాజు'తో మరోసారి ప్రేక్షకుల మనసు దోచుకుంటాననే నమ్మకం ఉంది.⇢ ఈ సినిమాలో నా పాత్ర పేరు చారులత. సంపన్న కుటుంబంలో పుట్టిన తండ్రి గారాల పట్టి లాంటి పాత్ర. ఇంట్లో యువరాణిలా పెరుగుతుంది. చాలా మంచి అమ్మాయి. అమాయకంగా, సున్నితమైన మనసు కలిగి ఉంటుంది. క్యూట్ గా బిహేవ్ చేస్తుంది. నన్ను పూర్తి కామెడీ పాత్రలో చూడబోతున్నారు. ఇది చాలా భిన్నమైన పాత్ర. నిజ జీవితంలో కాలేజ్ సమయంలో ఒకరిద్దరిని ఇలాంటి వారిని చూసి ఉన్నాను. డైరెక్టర్ ఇచ్చిన ఇన్ పుట్స్ ని బట్టి, నాకున్న అవగాహనను బట్టి ఈ పాత్రలో ఒదిగిపోయే ప్రయత్నం చేశాను. నా నిజ జీవిత పాత్రకు పూర్తి భిన్నంగా ఈ పాత్రను చేయాల్సి వచ్చింది. నేను ప్రాక్టికల్ గా ఉంటాను. చారులత పాత్ర మాత్రం ఎమోషనల్, సెన్సిటివ్ గా ఉంటుంది.⇢ నవీన్‌తో వర్క్ చేయడం అనేది.. సినిమా టీచింగ్ స్కూల్ లా ఉంది. సంక్రాంతికి వస్తున్నాంలో కామెడీ ఒకలా ఉంటే, నవీన్ కామెడీ మరోలా ఉంటుంది. పైగా సంక్రాంతికి వస్తున్నాం సినిమా కామెడీగా ఉన్నా.. నా పాత్ర కాస్త సీరియస్ గా ఉంటుంది. కానీ, ఇందులో పూర్తిగా కామెడీగా ఉంటుంది. ఇందులో టైమింగ్ అనేది చాలా ముఖ్యం. పంచ్ డైలాగ్స్ ని కరెక్ట్ టైమింగ్ లో చెప్పడం అనేది ఛాలెంజింగ్ గా అనిపించింది. ఇప్పటివరకు నేను చేసిన పాత్రల్లో ఇదే ఎక్కువ ఛాలెంజింగ్ అని చెప్పవచ్చు. కామెడీ అనేది చాలా కష్టం. పైగా ఇందులో కామెడీ కామెడీ కొత్తగా ఉంటుంది. ఈ సినిమాలో భాగం కావడం సంతోషంగా ఉంది.⇢ ఈ సినిమా వల్ల నటిగా నేను మరింత ఓపెన్ అయ్యాను. లక్కీ భాస్కర్ లోని సుమతి పాత్రకు ఈ చారులత పాత్ర పూర్తి భిన్నమైనది. దర్శకులు ఆ పాత్రలను మలిచిన తీరుకి తగ్గట్టుగా నన్ను నేను మలుచుకుంటాను. ఇందులో అద్భుతమైన కామెడీ టైమింగ్ చూస్తారు.⇢ గోదావరి ప్రాంతంలో చిత్రీకరణ అనుభూతి చాలా బాగుంది. అక్కడి ప్రజలు బాగా చూసుకున్నారు. ఎన్నో వంటకాలు తిన్నాను. ఆలయాలతో పాటు చుట్టుపక్కల ప్రాంతాలను సందర్శించాను. అక్కడి ప్రజలు సినిమా అంటే ప్రత్యేక అభిమానం చూపిస్తుంటారు. గోదావరి ప్రాంతంలో షూటింగ్ అనుభూతిని ఎప్పటికీ మరిచిపోలేను.⇢ ఇప్పుడు సినిమాలలో హీరోయిన్ పాత్రలకు ఎంతో ప్రాధాన్యత ఉంటుంది. అలాంటి ప్రాధాన్యత ఉన్న పాత్రలు లభించడం సంతోషంగా ఉంది. లక్కీ భాస్కర్ ఒక బాబుకి తల్లిగా కనిపించాను. సంక్రాంతికి వస్తున్నాంలో ఐపీఎస్ గా కనిపించాను. ఇప్పుడు పూర్తి భిన్నమైన పాత్రలో కనిపించనున్నాను. నటిగా నన్ను మరో కోణంలో చూపించే పాత్ర ఇది.⇢ నా దృష్టిలో సినీ ప్రయాణం అనేది ముగింపు లేని పరుగు పందెం లాంటిది. కొత్త కొత్త వాళ్ళు వస్తూ ఉంటారు. కాబట్టి విభిన్న పాత్రలు చేస్తూ నిరంతరం పరుగెడుతూనే ఉండాలి. నా వరకు సెటిల్ అయ్యాను, ఫలానా స్థానానికి చేరుకున్నాను లాంటి లెక్కలు ఉండవు. చేతిలో పని ఉండటం ముఖ్యమని భావిస్తాను.⇢ ప్రస్తుతం నాగ చైతన్య గారితో వృషకర్మ సినిమా చేస్తున్నాను. మరికొన్ని ఆసక్తికర కథలు కూడా ఉన్నాయి. ఆ చిత్రాలకు సంబంధించిన అధికారిక ప్రకటనలు త్వరలో వస్తాయి. -
టాలీవుడ్ హీరోతో పెళ్లి.. మీనాక్షి చౌదరి ఏమన్నారంటే..
సినీ తారల ప్రేమ, పెళ్లి విషయాలపై పుకార్లు కామన్. వాళ్లు నిజంగా ప్రేమలో ఉన్నా లేకపోయినా సరే.. సోషల్ మీడియాలో అయితే లెక్కలేనన్ని గాసిప్పులు వచ్చేస్తుంటాయి. అయితే కొంతమంది తారలు వాటిని లైట్‌గా తీసుకొని స్పందించకుండా ఉంటారు. మరికొంతమంది అయితే క్లారిటీ ఇస్తుంటారు. ఈ రెండో కోవాకు చెందిన హీరోయిన్నే మీనాక్షి చౌదరి. ఈ బ్యూటీపై ఇటీవల ఓ రూమర్ గట్టిగా వినిపించింది. అక్కినేని యంగ్ హీరో సుశాంత్‌తో మీనాక్షి(Meenakshi Chaudhary ) ప్రేమలో పడిందని.. త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నారనే వార్తలు వచ్చాయి. తాజాగా ఈ పుకార్లపై మీనాక్షి స్పందించింది. సుశాంత్ తనకు మంచి ఫ్రెండ్ మాత్రమేనని.. అంతకు మించి తమ మధ్య ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేసింది.‘ఇలాంటి పుకార్లు విని నవ్వుకుంటాను. సుశాంత్, నేను మంచి స్నేహితులం మాత్రమే. మేమిద్దరం కలిసి నటించాం(మీనాక్షి తొలి సినిమా ‘ఇచ్చట వాహనాలు నిలపరాదు’ సుశాంత్ హీరో). అంతకు మించి మా మధ్య ఎలాంటి సంబంధం లేదు. అయినా ఇండస్ట్రీలో అవన్నీ కామన్. రోజుకో గాసిప్ వస్తుంది. అవన్నీ నిజం కాదనీ అందరికీ తెలుసు. నేను కూడా వాటిని మైండ్‌కి తీసుకోను. అలా విని..ఇలా వదిలేస్తా’ అని ఓ ఇంటర్వ్యూలో మీనాక్షి చెప్పుకొచ్చింది. మీనాక్షి నటించిన తాజా చిత్రం ‘అనగనగా ఒక రాజు’. నవీన్ పొలిశెట్టి హీరోగా నటించిన ఈ మూవీ సంక్రాంతి కానుకగా జనవరి 14న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమా ప్రచారంలో భాగంగా ఇచ్చిన ఇంటర్వ్యూలోనే తన పెళ్లి పుకార్లపై స్పష్టత ఇచ్చింది. -
7 సినిమాలు.. రూ. 1000 కోట్ల బడ్జెట్.. నిర్మాతల ధైర్యం ఏంటి?
టాలీవుడ్‌కి సంక్రాంతి అతి పెద్ద సీజన్. ప్రతిసారి మూడు,నాలుగు సినిమాలు ఈ పండక్కి రిలీజ్ అవుతుంటాయి. కానీ ఈ సారి మాత్రం ఏకంగా 7 సినిమాలు(డబ్బింగ్ సినిమాలతో కలిసి) రిలీజ్ అవుతున్నాయి. చిరంజీవి, ప్రభాస్, రవితేజ లాంటి స్టార్ హీరోలతో పాటు శర్వానంద్, నవీన్ పొలిశెట్టి లాంటి కుర్ర హీరోలు కూడా బాక్సాఫీస్ బరిలో ఉన్నారు. భోగి, సంక్రాంతి, కనుమ ..ఇలా మూడు రోజులకు మూడు సినిమాలతో పాటు ఆ ముందూ వెనుక కూడా కొత్త సినిమాలు రిలీజ్ అవుతున్నాయి. అయితే ఒకే సారి ఇన్ని సినిమాలు వస్తే... ప్రేక్షకుల అన్నీ చూడగల్గుతారా? అంటే కచ్చితంగా నో అనే చెప్పాలి.ఓ వ్యక్తి తన ఫ్యామిలీతో కలిసి ఈ ఏడు సినిమాలు చూస్తే.. తక్కువలో తక్కువ 10-12 వేలు ఖర్చు అవుతుంది. పండగకు ఇంట్లో అయ్యే ఖర్చు అదనం. ఓ సగటు ప్రేక్షకుడు ఇంత భరించడం కష్టం. ఆ విషయం సినిమాలు రిలీజ్ చేస్తున్న నిర్మాతలకు కూడా తెలుసు. కానీ పండక్కి క్లిక్ అయితే భారీగా రాబట్టుకోవచ్చనే ఆశతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు. మొత్తం ఏడు సినిమాల బడ్జెట్ దాదాపు రూ. 1000 కోట్ల పైనే ఉంటుంది. వాటిల్లో అత్యధికంగా రాజాసాబ్‌కి రూ. 500 కోట్ల వరకు ఖర్చు అయినట్లు తెలుస్తుంది. ఆ తర్వాత చిరంజీవి మన శంకర్ వరప్రసాద్ సినిమాకు కూడా రూ. 200 కోట్లకు పైగా ఖర్చు అయిందట. రవితేజ ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’, నవీన్ ‘అనగనగ ఓ రాజు’, శర్వానంద్ నారీ నారి మురారి చిత్రాలన్నీ ఒక్కోటి రూ. 100 కోట్లకు పైగా బడ్జెట్‌తో తెరకెక్కినవే. ఇక డబ్బింగ్ సినిమాలు జననాయక్, పరాశక్తి కూడా భారీ బడ్జెట్ చిత్రాలే. మొత్తంగా ఈ చిత్రాల బడ్జెట్ మొత్తం రూ. 1000 కోట్లు దాటింది. నిర్మాతలకు సేఫ్ జోన్లోకి వెళ్లాలంటే..కనీసం రూ. 1500 కోట్ల కలెక్షన్స్ రాబట్టాలి. ఇది అసాధ్యం అనే చెప్పాలి. టాక్‌తో సంబంధం లేకుండా ప్రభాస్, చిరంజీవి సినిమాలకు తొలిరోజు భారీ కలెక్షన్సే వస్తాయి. హిట్ టాక్ వస్తే.. ఆ రెండు చిత్రాలు భారీగానే వసూలు చేస్తాయి. కానీ మిగిలిన సినిమాల పరిస్థితి అలా కాదు. సినిమా రిలీజ్ అయి.. సూపర్ హిట్ టాక్ వస్తే తప్ప.. ప్రేక్షకులకు థియేటర్స్‌కి వెళ్లరు. టాక్ని బట్టి వాటి కలెక్షన్స్ ఉంటాయి. మరి సంక్రాంతికి బాక్సాఫీస్ విన్నర్‌గా ఎవరు నిలుస్తారనేది మరికొద్ది రోజుల్లో తెలుస్తుంది.సంక్రాంతికి రిలీజ్ అయ్యే సినిమాలివే‘ది రాజా సాబ్’ (జనవరి 9)జననాయకుడు(జనవరి 9)పరాశక్తి(జనవరి 10)మన శంకర్ వరప్రసాద్ గారు(జనవరి 12)భర్త మహాశయులకు విజ్ఞప్తి(జనవరి 13)అనగనగ ఓరాజు(జనవరి 14)నారి నారి నడుమ మురారి(జనవరి 14)


