
తేజ సజ్జా హీరోగా వస్తోన్న సూపర్ యాక్షన్ అడ్వెంచరస్ చిత్రం మిరాయ్. ఈ మూవీకి కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వం వహించగా.. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్లో టీజీ విశ్వప్రసాద్ నిర్మించారు. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా సెప్టెంబర్ 12 ప్రపంచవ్యాప్తంగా ఎనిమిది భాషల్లో విడుదల కానుంది. ఈ సందర్భంగా నిర్మాత విశ్వప్రసాద్ మిరాయ్ గురించి మాట్లాడారు. టికెట్ ధరలు పెంచబోమని క్లారిటీ ఇచ్చారు. ఎక్కువ మంది సినిమా చూడాలనే ఉద్దేశంతోనే ఈ నిర్ణయం తీసుకున్నామని వెల్లడించారు.
ది రాజాసాబ్ అప్డేట్ ఇదే..
మిరాయ్ ప్రెస్మీట్లో ప్రభాస్ ది రాజాసాబ్ మూవీకి సంబంధించిన అప్డేట్ ఇచ్చారు నిర్మాత. వచ్చే ఏడాది జనవరి 9న సినిమా విడుదల కానుందని తెలిపారు. రిషబ్ శెట్టి కాంతార-2 ప్రదర్శించే థియేటర్లలో ది రాజాసాబ్ ట్రైలర్ను రిలీజ్ చేయనున్నట్లు వెల్లడించారు. అంటే ఈ లెక్కన అక్టోబర్ 2న ది రాజాసాబ్ ట్రైలర్ రిలీజ్ కానుంది. అంతేకాకుండా ప్రభాస్ పుట్టినరోజున తొలి పాటను విడుదల చేసే ఆలోచన ఉందని అన్నారు. దీంతో ప్రభాస్ ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు. కాగా.. ది రాజాసాబ్ మూవీకి మారుతి దర్శకత్వం వహిస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే టీజర్ విడుదల చేయగా.. అభిమానులను విపరీతంగా ఆకట్టుకుంది.
#TheRajaSaab trailer1 will be attached with #KantaraChapter1 🔥 - #TGVishwaPrasad, Producer.
Be ready for mass trailer in just one month. #KantaraChapter1onOct2 #TheRajaSaabTeaser #Prabhas #RishabhShetty #Bijuria pic.twitter.com/pmV250U6Q6— Subha The Luck (@Subha_The_Luck) September 3, 2025