రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన ‘ది రాజాసాబ్’మూవీకి మిక్స్‌డ్ టాక్ వచ్చినా.. బాక్సాఫీస్ వద్ద మాత్ర భారీ కలెక్షన్స్‌తో దూసుకెళ్తోంది. తొలి రోజే రూ. 112 కోట్లు వసూలు చేసిన ‘రాజాసాబ్’... నాలుగు రోజుల్లో ప్రపంచ వ్యాప్తంగా 201 కోట్ల రూపాయలకు పైగా వసూళ్లను సాధించింది. ఈ మేరకు మేకర్స్ అధికారికంగా ఓ పోస్టర్‌ని విడుదల చేశారు. సినిమాకు మిశ్రమ స్పందన వచ్చినప్పటికీ ఈ రేంజ్‌లో కలెక్షన్స్ రాబట్టడం చూసి ట్రేడ్ వర్గాలు షాకవుతున్నాయి. అయితే ప్రభాస్ స్థాయికి ఈ కలెక్షన్స్ తక్కువే కానీ.. పోటీలో చిరంజీవి లాంటి సినిమాలు ఉన్నప్పటికీ ఈ స్థాయిలో రావట్టడం గొప్ప విషయం.
మారుతి దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని పిపుల్ మీడియా ఫ్యాక్టర్ బ్యానర్ పై టీజీ విశ్వప్రసాద్ నిర్మించారు. కృతి ప్రసాద్. మాళవిక మోహనన్, నిధి అగర్వాల్, రిద్ధి కుమార్ హీరోయిన్లుగా నటించారు. సంక్రాంతి కానుకగా ఈ నెల 9న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. హాలీడేస్ సీజన్ లో ఫస్ట్ వీక్ "రాజా సాబ్" హ్యూజ్ నెంబర్స్ క్రియేట్ చేస్తుందనే అంచనాలు ఏర్పడుతున్నాయి.


