రాజాసాబ్‌, చిరంజీవి.. తెలంగాణలో జీవో తెచ్చేదెవరు? | Telangana GOVT Will ticket rate Hike The raja saab and chiranjeevi movies | Sakshi
Sakshi News home page

రాజాసాబ్‌, చిరంజీవి.. తెలంగాణలో బెన్ఫిట్‌ తెచ్చేదెవరు?

Jan 3 2026 1:08 PM | Updated on Jan 3 2026 1:19 PM

Telangana GOVT Will ticket rate Hike The raja saab and chiranjeevi movies

టాలీవుడ్బాక్సాఫీస్వద్ద వారంలో సంక్రాంతి సందడి ప్రారంభం కానుంది. రేసులో చాలా సినిమాలు ఉన్నాయి. చిన్న సినిమాలతో పాటు భారీ బడ్జెట్చిత్రాలు కూడా బరిలో ఉన్నాయి. ఇప్పటికే రాజా సాబ్ట్రైలర్రావడంతో ఆ సినిమాపై హైప్క్రియేట్అయింది. జనవరి 4 మన శంకర వరప్రసాద్గారు ట్రైలర్తో వస్తున్నారు. చిరంజీవి సినిమా కావడంతో ఎటూ బజ్‌ ఉంటుంది. అయితే, ఇప్పుడు రెండు సినిమాల టికెట్ధరల గురించి ఇండస్ట్రీలో చర్చ నడుస్తోంది.

ఆంధ్రప్రదేశ్లో ఎటూ ఈ రెండు చిత్రాలకు టికెట్ధరలు పెంచుకునేందుకు ఛాన్స్ఇవ్వడమే కాకుండా ప్రీమియర్షోలకు కూడా అనుమతి ఇచ్చేందుకు ఛాన్స్ఉంది. మరీ తెలంగాణలో పరిస్థితేంటి..? అనేది హాట్ టాపిక్‌గా మారింది. చిరంజీవి, ప్రభాస్సినిమాలకు సంబంధించిన చిత్ర యూనిట్‌లలో ముందుగా తెలంగాణ ప్రభుత్వాన్ని ఎవరు కదుపుతారు అనే చర్చ పెద్ద ఎత్తున సాగుతుంది. రీసెంట్గా అఖండ-2 మూవీకి టికెట్ధరలు పెంచితే తనకు తెలియకుండానే అధికారులు జీవో ఇచ్చారని సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. భవిష్యత్లో ఎవరూ టికెట్ రేట్ల పెంపు కోసం తమ ప్రభుత్వం వద్దకు రావద్దని మీడియా ద్వారా సినిమా వాళ్లకు తెలిపారు

అలాంటిది ఇప్పుడు టికెట్రేట్ల కోసం ప్రభుత్వంతో చర్చలు ఎవరు జరుపుతారు అనేది తేలాల్సి ఉంది. రాజా సాబ్నిర్మాత టీజీ విశ్వప్రసాద్‌, చిరంజీవిలలో ఎవరైనా రంగంలోకి దిగుతారా..? మంత్రి తన మనసు మార్చకుని వెసులుబాటు ఇస్తారా..? అనేది తేలాల్సి ఉంది. ఒకవేళ తెలంగాణలో టికెట్‌ ధరలు పెంపు అనేది లేకుండా రెండు సినిమాలను విడుదల చేస్తే.. బ్రేక్ ఈవెన్ దాటడం చాలా కష్టమని చెప్పవచ్చు. అయితే, మిగతా సినిమాలకు ఈ సమస్య లేదని చెప్పాలి అనగనగా ఒక రాజు, భర్త మహాశయులకు విజ్ఞప్తి సినిమాల నిర్మాతలు ఇప్పటికే ఈ విషయంపై  ఒక ప్రకటన చేశారు. తమ సినిమాలకు టికెట్ రేట్లు పెంచడం లేదని తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement