
సంక్రాంతి పండగ టాలీవుడ్‌కి అతి ముఖ్యమైనది. యావరేజ్ సినిమా కూడా హిట్ అయ్యే అవకాశం ఈ పండక్కే ఉంది. ఒక వేళ హిట్ టాక్ వస్తే.. బాక్సాఫీస్‌ని షేక్ చేసేది కూడా పండగే. అందుకే సంక్రాంతికి రావాలని పలువురు స్టార్స్ ప్లాన్ చేసుకుంటారు. ఎప్పటి మాదిరే ఈ సారి కూడా టాలీవుడ్‌లో పొంగల్ పోరు గట్టిగానే ఉంది. ఇప్పటికే రెండు సినిమాలు డేట్స్‌ని ప్రకటించాయి. మరో రెండు చిత్రాలు కూడా పండగ కోసమే రెడీ అవుతున్నాయి.

అందులో ఒకటి మెగాస్టార్ చిరంజీవి ‘మన శంకరవరప్రసాద్ గారు’(Mana Shankara Vara Prasad Garu) కూడా ఉంది. ‘పండగకి వస్తున్నారు’ అన్నది ఈ మూవీ ట్యాగ్‌లైన్. ట్యాగ్‌లైన్ చూస్తేనే ఇది పక్కా సంక్రాంతి మూవీ అని అర్థమైపోతుంది. కానీ ఇప్పటి వరకు డేట్ మాత్రం ప్రకటించలేదు. మరోవైపు ప్రభాస్ ‘ది రాజాసాబ్’(The Raja Saab)తో జనవరి 9న వస్తున్నట్లు ప్రకటించాడు. అలాగే యంగ్ హీరో నవీన్ పొలిశెట్టి ‘అనగనగా ఒక రాజు’తో జనవరి 14న ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు.

ఇక మిగిలిన డేట్స్ 12, 13 మాత్రమే. ఈ రెండు రోజుల్లో ఏదొ ఒక రోజు చిరంజీవి(Chiranjeevi) సినిమా రావాల్సింది. మరోవైపు రవితేజ కూడా సంక్రాంతి సమరానికి సై అంటున్నాడు. కిశోర్ తిరుమల దర్శకత్వంలో ఆయన నటిస్తున్న ఓ చిత్రం సంక్రాంతికి రిలీజ్ అవుతుందని టాక్ నడుస్తుంది. దు జనవరి 13న రిలీజ్ డేట్ లాక్ చేసినట్లు కూడా ప్రచారం జరుగుతోంది. ప్రస్తుతం జెట్ స్పీడ్‌తో జరుగుతోన్న షూటింగ్ అక్టోబర్ నాటికి పూర్తవుతుందని, ఆ వెంటనే పోస్ట్ ప్రొడక్షన్ పనులు మొదలుపెట్టి సంక్రాంతికి రంగంలోకి దించేలా ప్లాన్ చేస్తున్నారట. ఈ లెక్కన చిరంజీవికి 12వ తేది తప్ప మరో ఆప్షన్ లేదు.

దసరాకి ఈ సినిమా అప్డేట్ వస్తుంది. ఓ పాటను రిలీజ్ చేసే చాన్స్ ఉంది. అప్పుడైనా రిలీజ్ డేట్ ప్రకటిస్తారేమో చూడాలి. మొత్తానికి చిరంజీవి, ప్రభాస్, రవితేజ లాంటి స్టార్స్తో పాటు యంగ్ హీరో నవీన్ పొలిశెట్టి కూడా పొంగల్ పోరులో ఉన్నాడు. మరీ వీరిలో ఎవరు పై చేయి సాధిస్తారో? ఏ చిత్రం బాక్సాఫీస్ని షేక్ చేస్తుందో చూడాలి.
