breaking news
chinranjeevi
-
సీపీ సజ్జనార్‌ను కలిసిన టాలీవుడ్ ప్రముఖులు.. ఫోటోలు
-
రీరిలీజ్ హవా.. 15 రోజుల్లో 6 సినిమాలు!
ప్రస్తుతం చిత్ర పరిశ్రమలో రీరిలీజ్ హవా కొనసాగుతుంది. ముఖ్యంగా తెలుగులో ఈ ట్రెండ్ బాగా నడుస్తోంది. స్టార్ హీరోల సూపర్ హిట్ చిత్రాలు మరోసారి థియేటర్స్‌లో సందడి చేస్తున్నాయి. 4K రీమాస్టర్ వెర్షన్లతో పాత క్లాసిక్ సినిమాలు తిరిగి విడుదల అవుతున్నాయి.ఫ్యాన్స్ వీటిని బాగా ఆదరిస్తున్నాయి. కలెక్షన్స్ కూడా భారీగానే వస్తుండడంతో అందరు హీరోలు ఇప్పుడు ఇదే ట్రెండ్‌ని ఫాలో అవుతున్నారు. గతంలో సూపర్ హిట్‌గా నిలిచిన చిత్రాలన్నీ మరోసారి బాక్సాఫీస్ వద్ద తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నాయి. రానున్న పక్షం రోజుల్లో అరడజనుకు పైగా చిత్రాలు రీరిలీజ్ అవుతున్నాయి.‘శివ’తో ప్రారంభం.. నవంబర్ నెలలో కాంత, ఆంధ్రా కింగ్ తాలూకా చిత్రాలు మినహా మిగతా పెద్ద చిత్రాలేవి రిలీజ్ కావడం లేదు. చిన్న చిత్రాలు బరిలో ఉన్నప్పటికీ వాటిపై బజ్ క్రియేట్ కాలేదు. దీంతో ఈ గ్యాప్‌ని సొమ్ము చేసుకునేందుకు రెడీ అయ్యారు టాలీవుడ్ నిర్మాతలు. వరసగా పాత చిత్రాలను మళ్లీ థియేటర్స్‌లో విడుదల చేస్తున్నారు. ఈ నెలలో మొదటగా రీరిలీజ్ అవుతున్న చిత్రం ‘శివ’. 36 ఏళ్ల కిత్రం(1989) రామ్ గోపాల్‌వర్మ తెరకెక్కించిన ఈ చిత్రం.. టాలీవుడ్లో హిస్టరీ క్రియేట్ చేసింది. నాగార్జున కెరీర్లో అతి ముఖ్యమైన ఈ సినిమా.. నవంబర్ 14న మరోసారి ప్రేక్షకుల ముందుకు రానుంది. 4కె ప్రింట్‌తో, డాల్బీ అట్మాస్ సౌండ్ తో రాబోతున్న ఈ కల్ట్ మూవీ.. ఎన్ని రికార్డులను క్రియేట్ చేస్తుందో చూడాలి.‘కొదమసింహం’తో మెగాస్టార్.. ‘శివ రిలీజ్ అయిన మరుసటి రోజే.. అంటే నవంబర్ 15న సిద్ధార్థ్-త్రిషల సూపర్ హిట్ చిత్రం ‘నువ్వొస్తానంటే నేనొద్దంటానా’ మరోసారి ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ప్రభుదేవా దర్శకత్వం వహించిన ఈ చిత్రానికి దేవీశ్రీ ప్రసాద్ సంగీతం అందించాడు. ఈ మూవీలోని పాటలు ఎంత సూపర్ హిట్‌గా నిలిచాయో అందరికి తెలిసిందే. యూత్ టార్గెట్‌గా ఈ మూవీ మరోసారి థియేటర్స్‌లోకి రాబోతుంది.ఇక నవంబర్ 21న మెగాసార్ చిరంజీవి ‘కొదమసింహం’ రీరిలీజ్ కాబోతుంది. . చిరంజీవి నటించిన ఒకే ఒక కౌబాయ్ సినిమా ఇది. 1990, ఆగస్టు 9న ప్రేక్షకుల ముందుకొచ్చి ఘన విజయాన్ని సాధించిన "కొదమసింహం" సినిమాను ఈ నెల 21వ తేదీన 4కే కన్వర్షన్, 5.1 డిజిటల్ సౌండింగ్ తో సరికొత్తగా రమా ఫిలింస్ అధినేత కైకాల నాగేశ్వర రావు రీ రిలీజ్ చేస్తున్నారు.వారం గ్యాప్‌లో కోలీవుడ్ బ్రదర్స్కోలీవుడ్ బ్రదర్స్ సూర్య, కార్తికి తెలుగులో భారీ ఫాలోయింగ్ ఉన్న సంగతి తెలిసిందే. ఈ ఇద్దరు హీరోలు వారం గ్యాప్‌లో బాక్సాఫీస్ ముందుకు రాబోతున్నారు. కార్తిని తెలుగు ప్రేక్షకులకు బాగా దగ్గర చేసిన చిత్రం ‘ఆవారా’. ఈ మూవీ తర్వాత టాలీవుడ్లో కార్తి మార్కెట్ పెరిగింది. ఇప్పుడు ఈ చిత్రం మరోసారి థియేటర్స్‌లో సందడ చేయబోతుంది. నవంబర్ 22న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఇక వారం రోజుల గ్యాప్ తర్వాత కార్తీ బ్రదర్, కోలీవుడ్ హీరో సూర్య ‘సికిందర్’ చిత్రం రీరిలీజ్ కాబోతుంది.ఇక నవంబర్ చివరి వారం(నవంబర్ 29)లో మహేశ్ బాబు ‘బిజినెస్ మెన్’ తో మరోసారి థియేటర్స్‌లోకి వచ్చేస్తున్నాడు. ఇప్పటికే ఒకసారి ఈ చిత్రం రీరిలీజ్ అయింది. అయితే అప్పుడు కొన్ని చోట్ల మాత్రమే రిలీజ్ చేశారు. ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల్లో పెద్ద ఎత్తున రీరిలీజ్‌కి ప్లాన్ చేసినట్లు సమాచారం. మొత్తంగా రానున్న 15 రోజుల్లో అరడజనుకు పైగా సినిమాలు మరోసారి విడుదల కానున్నాయి. వీటీల్లో ఏ చిత్రం భారీ కలెక్షన్స్‌ని రాబడుతుందో చూడాలి. -
సంక్రాంతి పోరు.. బరిలో ‘ఆ నలుగురు’
సంక్రాంతి పండగ టాలీవుడ్‌కి అతి ముఖ్యమైనది. యావరేజ్ సినిమా కూడా హిట్ అయ్యే అవకాశం ఈ పండక్కే ఉంది. ఒక వేళ హిట్ టాక్ వస్తే.. బాక్సాఫీస్‌ని షేక్ చేసేది కూడా పండగే. అందుకే సంక్రాంతికి రావాలని పలువురు స్టార్స్ ప్లాన్ చేసుకుంటారు. ఎప్పటి మాదిరే ఈ సారి కూడా టాలీవుడ్లో పొంగల్ పోరు గట్టిగానే ఉంది. ఇప్పటికే రెండు సినిమాలు డేట్స్‌ని ప్రకటించాయి. మరో రెండు చిత్రాలు కూడా పండగ కోసమే రెడీ అవుతున్నాయి. అందులో ఒకటి మెగాస్టార్ చిరంజీవి ‘మన శంకరవరప్రసాద్ గారు’(Mana Shankara Vara Prasad Garu) కూడా ఉంది. ‘పండగకి వస్తున్నారు’ అన్నది ఈ మూవీ ట్యాగ్‌లైన్. ట్యాగ్‌లైన్ చూస్తేనే ఇది పక్కా సంక్రాంతి మూవీ అని అర్థమైపోతుంది. కానీ ఇప్పటి వరకు డేట్ మాత్రం ప్రకటించలేదు. మరోవైపు ప్రభాస్ ‘ది రాజాసాబ్’(The Raja Saab)తో జనవరి 9న వస్తున్నట్లు ప్రకటించాడు. అలాగే యంగ్ హీరో నవీన్ పొలిశెట్టి ‘అనగనగా ఒక రాజు’తో జనవరి 14న ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు.ఇక మిగిలిన డేట్స్ 12, 13 మాత్రమే. ఈ రెండు రోజుల్లో ఏదొ ఒక రోజు చిరంజీవి(Chiranjeevi) సినిమా రావాల్సింది. మరోవైపు రవితేజ కూడా సంక్రాంతి సమరానికి సై అంటున్నాడు. కిశోర్ తిరుమల దర్శకత్వంలో ఆయన నటిస్తున్న ఓ చిత్రం సంక్రాంతికి రిలీజ్ అవుతుందని టాక్ నడుస్తుంది. దు జనవరి 13న రిలీజ్ డేట్ లాక్ చేసినట్లు కూడా ప్రచారం జరుగుతోంది. ప్రస్తుతం జెట్ స్పీడ్‌తో జరుగుతోన్న షూటింగ్ అక్టోబర్ నాటికి పూర్తవుతుందని, ఆ వెంటనే పోస్ట్ ప్రొడక్షన్ పనులు మొదలుపెట్టి సంక్రాంతికి రంగంలోకి దించేలా ప్లాన్ చేస్తున్నారట. ఈ లెక్కన చిరంజీవికి 12వ తేది తప్ప మరో ఆప్షన్ లేదు. దసరాకి ఈ సినిమా అప్డేట్ వస్తుంది. ఓ పాటను రిలీజ్ చేసే చాన్స్ ఉంది. అప్పుడైనా రిలీజ్ డేట్ ప్రకటిస్తారేమో చూడాలి. మొత్తానికి చిరంజీవి, ప్రభాస్, రవితేజ లాంటి స్టార్స్‌తో పాటు యంగ్ హీరో నవీన్ పొలిశెట్టి కూడా పొంగల్ పోరులో ఉన్నాడు. మరీ వీరిలో ఎవరు పై చేయి సాధిస్తారో? ఏ చిత్రం బాక్సాఫీస్‌ని షేక్ చేస్తుందో చూడాలి. -
చిరంజీవిని కలిసిన సోము వీర్రాజు
సాక్షి, హైదరాబాద్ : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు గురువారం సినీ నటుడు చిరంజీవిని కలిశారు. బీజేపీ చీఫ్‌గా బాధ్యతలు చేపట్టిన అనంతరం ఆయన తొలిసారి చిరంజీవిని హైదరాబాద్‌లో మర్యాదపూర్వకంగా కలిశారు. చిరంజీవి ఈ సందర్భంగా సోము వీర్రాజుకు అభినందనలు తెలిపి పుష్పమాల, శాలువాతో సత్కరించారు. సోదరుడు పవన్ కల్యాణ్‌తో కలిసి ప్రజా సమస్యల పరిష్కారం కోసం కృషి చేయాలని సూచించారు. -
అత్యంత ఖరీదైన దుస్తులు అవే!!
టాలీవుడ్లో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న మూవీ సైరా నరసింహారెడ్డి. ఈ సినిమాలో మిల్క్ బ్యూటీ తమన్నా కీలక పాత్రలో నటిస్తున్న సంగతి తెలిసిందే. చారిత్రక నేపథ్యంలో రూపొందుతున్న ఈ సినిమాలో ‘లక్ష్మీ’ గా ఆమె అలరించనున్నారు. ఈ క్రమంలో సినిమాలో తన క్యాస్టూమ్స్ గురించి ఈ ముద్దుగుమ్మ పలు ఆసక్తికర విషయాలు వెల్లడించారు. ‘ బాహుబలి తర్వాత నా కెరీర్లో అత్యంత భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతున్న మూవీ సైరా నరసింహారెడ్డి. 18 వ శతాబ్దపు స్వాతంత్ర్య సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవిత చరిత్ర ఆధారంగా ఈ సినిమా రూపొందిస్తున్నారు. ఈ సినిమాలో భారతీయ సంప్రదాయాన్ని ప్రతిబింబించే దుస్తులు ధరించాను. డిజైనర్లు సుస్మిత(చిరంజీవి కుమార్తె), అంజూ మోదీ నా కోసం ప్రత్యేకమైన లెహంగాలు రూపొందించారు. నా జీవితంలో నేను ధరించిన అత్యంత ఖరీదైన దుస్తులివే’ అంటూ తమన్నా మురిసిపోయారు. కాగా తొలి స్వాతంత్ర్య సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవితం ఆధారంగా.. చిరంజీవి ప్రధాన పాత్రలో సైరా నరసింహారెడ్డి తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాను... రామ్ చరణ్ భారీ బడ్జెట్‌తో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. సురేందర్ రెడ్డి దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమాలో నయనతార హీరోయిన్గా నటిస్తుండగా.. అమితాబ్ బచ్చన్, విజయ్ సేతుపతి, జగపతిబాబు తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. -
150వ సినిమాకు హీరోయిన్ ఫైనల్?
హైదరాబాద్: మెగాస్టార్ చిరంజీవి 150 వ సినిమాలో ఆయనతో జతకట్టే హీరోయిన్ ఎవరో తేలిపోయింది. గత కొన్ని రోజులుగా హాట్ టాపిక్ గా మారిన ఈ అంశంలో ఎట్టకేలకు ఒకక్లారిటీ వచ్చినట్టు తెలుస్తోంది. చిరంజీవి వయసుకు తగ్గట్టుగా అందాల భామ నయన తారను ఎంపిక చేసినట్టు తెలుస్తోంది. దర్శకుడు వీవీ వినాయక్‌తో రెండు చిత్రాలు చేసిన నయన్ అయితేనే మెగాస్టార్ కు సరిజోడి అని సూచించినట్టు సమచారం. దీంతో ఈ క్రేజీ డైరెక్టర్ సూచనకు ఒకే చెప్పినట్టు సమాచారం. రాజకీయాల్లో ఎంట్రీ ఇచ్చి కొద్ది కాలం తరువాత తెరకెక్కుతున్న ఈ మూవీ టాలీవుడ్ భారీ అంచనాలు నెలకొన్నాయి. అయితే తమిళంలో హిట్టయిన ‘కత్తి' చిత్రాన్ని తెలుగులో చిరంజీవి 150వ సినిమాగా రీమేక్ చేస్తున్నారు. తెలుగు నేటివిటీకి అనుగుణంగా స్క్రిప్టులో మార్పులు, చేర్పులతో వివి వినాయక్ దర్శకత్వంలోఈ మూవీ రాబోతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో చిరంజీవి సరసన ఎవరు నటిస్తారు? అనేది చాలా కాలంగా ఉత్కంఠను రాజేసింది. సినిమా స్క్రిప్ట్ పూర్తి అయిందని, షెడ్యూల్ ఫిబ్రవరి లేదా మార్చి నుంచి ప్రారంభమవుతుందని వార్తలు వస్తున్నాయి. మెగాస్టార్ సినిమాను కొడుకు, టాలీవుడ్ యంగ్ హీరో రామ్‌చరణ్ ప్రొడ్యూస్ చేయనున్నాడు. ఈ సినిమాకోసం చిరు దాదాపు రోజూ జిమ్‌కు వెళ్తూ కసరత్తు చేస్తున్న సంగతి విదితమే.


