ప్రభాస్- మారుతి మూవీ ది రాజాసాబ్ నుంచి హిట్ సాంగ్ వీడియో వర్షన్‌ను తాజాగా విడుదల చేశారు. ప్రభాస్, నిధి అగర్వాల్ జోడీగా 'సహనా సహనా..' అంటూ మెప్పించిన ఈ పాట థియేటర్స్‌లో ప్రేక్షకులను బాగా మెప్పించింది. కృష్ణకాంత్ రాసిన ఈ పాటను విశాల్ మిశ్రా పాడారు. రొమాంటిక్ కామెడీ హారర్ మూవీగా తెరకెక్కిన ఈ మూవీకి తమన్ సంగీతం అందించారు. ఈ సినిమాలో ప్రభాస్ సరసన మాళవికా మోహనన్, రిద్ధి కుమార్ కూడా నటించిన విషయం తెలిసిందే. జనవరి 9న విడుదలైన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద రూ. 250 కోట్లకు పైగానే రాబట్టింది. అయితే, సినిమా ఫస్ట్ ఆటతోనే భారీగా ట్రోలింగ్‌కు గురికావడంతో కలెక్షన్స్‌పై భారీ ప్రభావం చూపింది.


