
కల్కి సినిమా తర్వాత ప్రభాస్ (Prabhas) కథానాయకుడిగా నటిస్తున్న చిత్రం ‘ది రాజా సాబ్’ (The Raja Saab). మారుతి దర్శకత్వంలో తెరకెక్కుతున్న రొమాంటిక్ కామెడీ హారర్ చిత్రం కోసం అభిమానులు భారీగానే ఎదురుచూస్తున్నారు. తాజాగా ఈ మూవీ ట్రైలర్ గురించి ప్రకటన చేశారు. ప్రభాస్ రాయల్ ఎంట్రీ కోసం ఎదురుచూస్తున్నవారందరికీ శుభవార్త అంటూ ఒక పోస్టర్‌ను విడుదల చేశారు. ఇప్పటికే విడుదలైన టీజర్‌కు మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇందులో ప్రభాస్ వింటేజ్ లుక్‌లో కనిపించారంటూ ప్రశంసలు దక్కాయి.

‘ది రాజా సాబ్’ (The Raja Saab) ట్రైలర్ సెప్టెంబర్ 29న సాయింత్రం ఆరు గంటలకు విడుదల కానున్నట్లు మేకర్స్ ప్రకటించారు. ఇదే విషయాన్ని ప్రభాస్ కూడా ప్రకటించారు. ఒక అభిమానిగా నా హీరోని ఎలా చూడాలనుకున్నానో ఆ విధంగానే ప్రభాస్‌ను చూపించానని మారుతి అన్నారు. దీంతో డార్లింగ్ ఫ్యాన్స్‌లో ఫుల్ జోష్ పెరిగింది. ఈ మూవీలో వచ్చే 40 నిమిషాల క్లైమాక్స్ అద్భుతంగా ఉంటుందని కూడా దర్శకుడు చెప్పారు. ఈ చిత్రం సుమారు 3గంటల పాటు రన్ టైమ్ ఉంటుందన్నారు.
దర్శకుడు మారుతి. ప్రభాస్ తొలిసారి ఈ సినిమా కోసం కలిసి పనిచేస్తున్నారు. పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీతో టీజీ విశ్వప్రసాద్ భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు. నిధి అగర్వాల్, మాళవిక మోహనన్, రిద్ది కుమార్ హీరోయిన్స్‌గా నటిస్తున్నారు. సంజయ్ దత్ (Sanjay Dutt) కీలక పాత్రలో కనిపించనున్నారు. ఈ సినిమా డిసెంబరు 5న థియేటర్లలోకి రానుంది.
The wait of millions finally comes to an end 💥💥#TheRajaSaabTRAILER will be out on September 29th at 6PM.
A ROYAL entry into a world of FUN, FEAR and a whole lot of Majestic Experiences ❤️🔥#TheRajaSaab #Prabhas @DuttSanjay @DirectorMaruthi @AgerwalNidhhi @MalavikaM_… pic.twitter.com/9q8WcHXSj2— Director Maruthi (@DirectorMaruthi) September 28, 2025