
హీరో విజయ్ దేవరకొండ రీసెంట్‌గానే రష్మికతో నిశ్చితార్థం చేసుకున్నాడని టాక్. ఇది నిజమే అయినప్పటికీ బయటకు చెప్పకుండా రహస్యంగా ఉంచుతున్నారు. అయితే ఇది జరిగిన వెంటనే విజయ్.. తల్లి, తమ్ముడు ఆనంద్‌తో కలిసి పుట్టపర్తి సాయిబాబా దర్శనం చేసుకున్నాడు. ఒకటి రెండు ఫొటోలతో ఈ విషయం కూడా బయటపడింది. అయితే ఇప్పుడు ఆ ట్రిప్ వీడియోని స్వయంగా విజయ్ తన ఇన్ స్టాలో పోస్ట్ చేశాడు.
పుట్టపర్తి వెళ్లడం తనకు ఎంతో ఆనందంగా ఉందని చెప్పిన విజయ్ దేవరకొండ.. తను మొదట చేరిన '1ఏ' క్లాస్ రూమ్.. వేదాలు, మంత్రాలు, భజనలు నేర్చుకున్న మందిరం.. గతంలో తనలా ఇప్పుడు ఇక్కడున్న పిల్లలు... నా రూమ్ బీ-13 మధ్యలో కప్ బోర్డ్ నాదే.. మమ్మల్ని సక్రమమైన దారిలో నడిపించిన సార్స్.. అంటూ 20 ఏళ్ల తన జ్ఞాపకాల్ని వీడియో రూపంలో పొందుపరిచి ఇన్ స్టాలో వీడియోగా పోస్ట్ చేశాడు.
(ఇదీ చదవండి: పవన్ సినిమాలో మూడు కోట్ల ఆఫర్.. ఆ రోల్‌కు ఒప్పుకోలేదు: మల్లా రెడ్డి)


విజయ్ దేవరకొండ ముఖంలో పెళ్లికళ ఉట్టిపడుతున్నట్లు కనిపిస్తుంది. ఎందుకంటే ఇంత సడన్‌గా పుట్టపర్తి దర్శనం చేసుకోవాల్సిన అవసరం విజయ్ దేవరకొండకు అయితే లేదు. అలాంటిది ఫ్యామిలీతో కలిసి అక్కడికి వెళ్లాడంటే కచ్చితంగా నిశ్చితార్థం జరిగిన తర్వాత సాయిబాబా ఆశీర్వదాలు తీసుకోవడానికేనని రౌడీ హీరో అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు.
అయితే పుట్టపర్తి దర్శనానంతరం.. విజయ్ ప్రయాణిస్తున్న కారు ఓ చోట ప్రమాదానికి గురైంది. అయితే ఈ యాక్సిడెంట్‌లో ఎవరికీ ఎలాంటి గాయాలు కాలేదు. దీంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. ఏదేమైనా ఇప్పుడు విజయ్ పోస్ట్ చేసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయిపోతోంది.
(ఇదీ చదవండి: 80'స్ రీ యూనియన్.. వీడియో వైరల్)