
1980ల్లో దక్షిణాది భాషల్లో హీరోహీరోయిన్లుగా నటించిన స్టార్స్.. ప్రతి ఏడాది ఒక్కచోటకు చేరి సెలబ్రేట్ చేసుకుంటూ ఉంటారు. తాజాగా చెన్నైలో రీయూనియన్ జరిగింది. రెండు రోజుల క్రితం ఫొటోలు బయటకు రాగా ఇప్పుడు వీడియో బయటకొచ్చింది. అందరూ దీన్ని తమ సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు.
ఇది 12వ రీ యూనియన్ అని నటుడు నరేశ్ పోస్ట్ పెట్టాడు. ఈ ఏడాది వీరంతా చిరుత థీమ్‌ని ఎంచుకున్నారు. చిరుత థీమ్‌లో దుస్తులు ధరించి సందడి చేశారు. చిరంజీవి, వెంకటేశ్, జాకీ ష్రాఫ్, శరత్ కుమార్, రాజ్‌కుమార్ సేతుపతి, నరేశ్, సుప్రియ, నదియ, రాధ, రమ్యకృష్ణ, సుమలత, జయసుధ, శోభన తదితరులు ఉత్సాహంగా డ్యాన్సులు వేస్తూ ఆడిపాడుతూ కనిపించారు.
All about 80’s Reunion ❤️ pic.twitter.com/U0yUq9NbAP
— Naresh Vijaya Krishna (@ItsActorNaresh) October 7, 2025