
రెండు తెలుగు రాష్ట్రాల్లో మల్లా రెడ్డి గురించి తెలియనివారు ఉండరు. రాజకీయాల్లో ఉన్నప్పటికీ అప్పుడప్పుడు తనలోని కళామతల్లిని బయట పెడుతుంటారు. ఏదైనా ఈవెంట్స్కు వెళ్లినప్పుడు డ్యాన్స్తోనూ అలరిస్తూ సందడి చేస్తుంటారు. మల్లా రెడ్డి యూనివర్సిటీలో సినిమా ఈవెంట్స్ జరిగితే తనలో టాలెంట్ను ఒక్కసారిగా బయటికి తీసుకొస్తారు. అందుకే మల్లారెడ్డి అంటే కేవలం రాజకీయ నాయకుడే కాదు..కళాకారుడిగా కూడా ఆయనకు పేరు ఉంది.
అయితే ఇటీవల దసరా సందర్భంగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న మల్లారెడ్డి ఓ ఆసక్తికర విషయాన్ని పంచుకున్నారు. తనకు టాలీవుడ్ డైరెక్టర్ హరీశ్ శంకర్ సినిమాలో విలన్ పాత్రను ఆఫర్ చేశాడని చెప్పారు. ఆ రోల్ కోసం మా కాలేజీకి వచ్చి ఒక గంటసేపు వెయిట్ చేశాడని తెలిపారు. అంతేకాకుండా రూ.3 కోట్ల పారితోషికం కూడా ఆఫర్ చేశాడని వెల్లడించారు. అయినా కూడా నేను ఆ పాత్రను ఒప్పుకోలేదని మల్లారెడ్డి వివరించారు. విలన్గా చేస్తే ఇంటర్వెల్దాకా నేను హీరోను కొడతా.. ఆ తర్వాత హీరో నన్ను కొడతాడు.. తిడతాడు అంటూ హాస్యంగా మాట్లాడారు. ఈ కామెంట్స్ కాస్తా నెట్టింట వైరల్‌గా మారాయి.