breaking news
papa movie
-
కంటతడి పెట్టించే ‘పాపా’
కవిన్, అపర్ణాదాస్ జంటగా నటించిన తమిళ చిత్రం ‘డాడా’. గణేశ్ కె.బాబు దర్శకత్వం వహించిన ఈ చిత్రం తమిళంలో రూ. 40 కోట్లు వసూలు చేసింది. ఎన్నారై శ్రీమతి నీరజ కోట ఈ చిత్రాన్ని ‘పాపా’ పేరుతో తెలుగులో విడుదల చేశారు. ఈ చిత్రం కథ విషయానికొస్తే.. పెళ్ళికి ముందే హద్దులు దాటిన ఒక జంట జీవితంలో చోటు చేసుకున్న విచిత్ర మలుపుల సమహారమే ఈ చిత్రం. మణి (కవిన్), సింధు (అపర్ణ దాస్) ఇద్దరు ప్రేమించుకుంటారు. కాలేజీ టైంలోనే సింధు గర్భం దాల్చుతుంది. ఈ విషయం ఇద్దరి కుటుంబాలలో తెలిసి.. ఇద్దరిని బయటకు వెళ్లగొడతారు. బయటకు వచ్చి ఇద్దరు కలిసి కొత్త జీవితాన్ని ప్రారంభిస్తారు. ఒకవైపు చదువుతూనే వైవాహిక జీవితాన్ని ఎలా కొనసాగించారు? ఈ క్రమంలో వారిద్దరికి ఎదురైన సమస్యలు ఏంటి? చివరి వరకు ఈ జంట కలిసే ఉందా లేదా అనేది తెలియాలంటే సినిమా చూడాల్సిందే. వయసులో ఉండే ఆకర్షణలు, ఆవేశాలు, అపార్ధాలు, తరాల మధ్య అంతరాలు, వ్యక్తుల మధ్య ఉండే ఇగోలు, ఫ్రెండ్ షిప్, హెల్పింగ్ నేచర్, ముఖ్యంగా బంధాలు, భావోద్వేగాల కలబోతగా "పాపా" చిత్రాన్ని దర్శకుడు గణేష్ బాబు ఎంతో హృద్యంగా తెరకెక్కించాడు. కథగా చెప్పుకోవడానికి సింపుల్ గా ఉన్నా... కథనాన్ని రక్తి కటించిన తీరుకు ఎవ్వరైనా ఫిదా అవ్వాల్సిందే.భాగ్యరాజా, విటివి గణేష్ తప్ప మిగతా పాత్రలు పోషించినవారు మనకు తెలియనివారే అయినప్పటికీ... ప్రేక్షకులు ఆయా పాత్రలతో ప్రయాణం చేస్తారు. ముఖ్యంగా క్లైమాక్స్ లో కంట తడి పెట్టని వారంటూ ఎవరూ ఉండరు. హృదయాల్ని మెలిపెట్టేసే పతాక సన్నివేశాలు ఈ చిత్రానికి ప్రధాన ఆకర్షణ. . హీరోయిన్ అపర్ణాదాస్... కెరీర్ బిగినింగ్ నాటి నయనతారను కాస్త పోలి ఉండడం వల్ల... అట్లీ దర్శకత్వంలో ఆర్య - నయనతార నటించగా ఘన విజయం సాధించిన "రాజా - రాణి" చిత్రం గుర్తుకు వస్తుంది. అయితే ఆ పోలిక జోనర్ కు మాత్రమే పరిమితం.హీరోగా నటించిన కవిన్, హీరోయిన్ పాత్ర పోషించిన అపర్ణాదాస్ ప్రేక్షకుల్ని కట్టి పడేస్తారు. వీళ్ళ అబ్బాయిగా చేసిన మాస్టర్ ఇయాన్ తోనూ మనం ప్రేమలో పడిపోతాం. ముఖ్యంగా క్లైమాక్స్ లో కంట తడి పెట్టని వారంటూ ఎవరూ ఉండరు. హృదయాల్ని మెలిపెట్టేసే పతాక సన్నివేశాలు ఈ చిత్రానికి ప్రధాన ఆకర్షణ. హీరోయిన్ అపర్ణాదాస్... కెరీర్ బిగినింగ్ నాటి నయనతారను కాస్త పోలి ఉండడం వల్ల... అట్లీ దర్శకత్వంలో ఆర్య - నయనతార నటించగా ఘన విజయం సాధించిన "రాజా - రాణి" చిత్రం గుర్తుకు వస్తుంది. అయితే ఆ పోలిక జోనర్ కు మాత్రమే పరిమితం. ఎడిటింగ్ పరంగా ఇంకొంచెం క్రిస్పీగా ఉంటే మరింత బాగుండేదనిపిస్తుంది. అలాగే సెకండాఫ్ లో హీరోహీరోయిన్ల మధ్య కాన్ఫ్లిక్ట్ ను ఇంకొంచెం క్యాష్ చేసుకునెలా రెండుమూడు సీన్స్ కన్సీవ్ చేసుకుని ఉంటే ఎమోషన్ మరింత పండేదనిపిస్తుంది "సింగిల్ పేరెంటింగ్"లో ఉండే పెయిన్, తండ్రీకొడుకుల మధ్య బాండింగ్ కు ఇంకొంచెం ప్రాధాన్యత ఇచ్చి ఉంటే కూడా ఇంకా బాగుండేదనిపిస్తుంది. అయితే... మనసు తడిని వెలికి తీసే క్లైమాక్స్... ఇటువంటి చిన్న చిన్న కంప్లైంట్స్ కు తావు లేకుండా చేస్తుంది. -
అక్కడ ‘డా డా’.. ఇక్కడ ‘పా పా’
తమిళ, మలయాళ, కన్నడ చిత్రాలకు తెలుగులో మంచి ఆదరణ ఉంది. అందుకే అక్కడ హిట్టయిన చిత్రాలన్నీ తెలుగులోనూ రలీజ్ అవుతుంటాయి. అలా తెలుగులో రిలీజ్ కాబోతున్న తమిళ బ్లాక్ బస్టర్ చిత్రమే డాడా. కవిన్, అపర్ణా దాస్ జంటగా నటించిన ఈ చిత్రం తమిళ్లో రిలీజై బ్లాక్ బస్టర్ హిట్‌గా నిలిచింది. ఇప్పుడు ఇదే చిత్రం తెలుగులో పాపా పేరుతో రిలీజ్ కాబోతుంది. ఈ చిత్రానికి గణేష్ కె బాబు దర్శకత్వం వహించారు. "పా పా" చిత్రాన్ని జేకే ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై నిర్మాత నీరజ కోట తెలుగు ఆడియెన్స్ ముందుకు తీసుకొస్తున్నారు. ఈ నెల 13న ఈ సినిమా గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు రెడీ అవుతోంది. మంగళవారం ఈ చిత్రం ట్రైలర్ ను ప్రముఖ దర్శకులు ఎ. కోదండరామిరెడ్డి, బి. గోపాల్ చేతుల మీదుగా రిలీజ్ చేశారు.ఈ సందర్భంగా దర్శకుడు ఎ. కోదండరామిరెడ్డి మాట్లాడుతూ - ఈ చిత్రంలో హీరో హీరోయిన్స్ తో పాటు వారి బాబు పాత్రకు చాలా ఇంపార్టెన్స్ ఉన్నట్లు తెలుస్తోంది. మంచి ఎమోషనల్ ఫ్యామిలీ మూవీగా ప్రేక్షకుల్ని ఈ సినిమా ఆకట్టుకోవాలి కోరుకుంటున్నాను’ అన్నారు.దర్శకుడు బి.గోపాల్ మాట్లాడుతూ -బడ్జెట్ లో చేసిన తమిళ చిత్రాలు కూడా తెలుగులో మంచి వసూళ్లు చేసిన సందర్భాలు ఉన్నాయి. "డా డా " సినిమా తమిళంలో 42 కోట్ల రూపాయలు వసూలు చేసింది. అలాగే తెలుగులో "పా పా" పేరుతో ఈ సినిమా రిలీజ్ అవుతోంది. సాంగ్స్ బాగున్నాయి, ట్రైలర్ ఆకట్టుకుంది. ఎమోషన్స్, ఫ్యామిలీ డ్రామా బాగున్నాయి. ఈ సినిమా మంచి విజయం సాధించి నిర్మాత నీరజ కోట గారికి పేరు, డబ్బు తీసుకురావాలని కోరుకుంటున్నా’ అన్నారు. ప్రొడ్యూసర్ నీరజ కోట మాట్లాడుతూ - మా జేకే ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ మీద చేస్తున్న ఫస్ట్ మూవీ "పా పా". ఈ చిత్రం తమిళంలో"డా డా " పేరుతో రిలీజై ఘన విజయాన్ని సాధించింది. అలాంటి విజయమే తెలుగు ప్రేక్షకులు కూడా మాకు అందిస్తారని కోరుకుంటున్నా. ఈ రోజు మా మూవీ ట్రైలర్ లాంఛ్ కు వచ్చి సపోర్ట్ అందించిన డైరెక్టర్స్ కోదండరామిరెడ్డి గారికి, బి. గోపాల్ గారికి థ్యాంక్స్. అన్నారు. -
తండ్రీ కొడుకుల అనుబంధం
కవిన్, అపర్ణా దాస్ లీడ్ రోల్స్‌లో నటించిన చిత్రం ‘డా..డా’. గణేశ్ కె.బాబు దర్శకత్వం వహించిన ఈ సినిమా తమిళంలో ఘన విజయం సాధించింది. భాగ్యరాజా, వీటీవీ గణేశ్, ఐశ్వర్య, ప్రదీప్ శక్తి తదితరులు నటించిన ఈ చిత్రాన్ని ‘΄పా..పా..’ పేరుతో జేకే ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్‌పై నిర్మాత నీరజ కోట తెలుగులో విడుదల చేస్తున్నారు. జనవరి 3న ఆంధ్రప్రదేశ్, తెలంగాణతోపాటు అమెరికా, ఆస్ట్రేలియాలో ఈ చిత్రం విడుదల కానుంది.నీరజ కోట మాట్లాడుతూ– ‘‘తండ్రీ కొడుకుల అనుబంధం నేపథ్యంలో తెరకెక్కిన చిత్రం ‘΄పా..పా..’. భావోద్వేగం, ప్రేమ, వినోదం... ఇవన్నీ సమ పాళ్లలో ఉన్న ఫీల్ గుడ్ ఎమోషనల్ డ్రామా ఇది. తమిళంలో బ్లాక్ బస్టర్‌గా నిలిచిన ఈ మూవీ తెలుగు ప్రేక్షకులకు కూడా కనెక్ట్ అవుతుందనే నమ్మకం ఉంది. ఎంజీఎం సంస్థ నుంచి అచ్చిబాబు ఈ మూవీని విడుదల చేయనున్నారు’’ అని చెప్పారు. -
దర్శకుడు యోగి అసభ్యంగా ప్రవర్తించాడు: హీరోయిన్
హైదరాబాద్: పాప సినిమా వివాదంలో మరో ట్విస్ట్ వెలుగుచూసింది. ఈ సినిమా హీరోయిన్ అనుకృతి.. దర్శకుడు యోగిపై పోలీసులకు ఫిర్యాదు చేసేందుకు సిద్ధమైంది. యోగి తనపట్ల అసభ్యంగా ప్రవర్తించాడని అనుకృతి ఆరోపిస్తోంది. ఈ సినిమా నుంచి అనుకృతి అర్ధాంతరంగా తప్పుకుందని యోగి ఆరోపించిన సంగతి తెలిసిందే. ఆదివారం ఆయన ఈ మేరకు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కాగా పాప సినిమాలో తన పాత్ర డైలాగ్స్ అసభ్యంగా ఉన్నయని, ఇవి తన ఇమేజ్ ను దెబ్బతీస్తాయని హీరోయిన్ అనుకృతి చెప్పింది. దీనిపై యోగి స్పందిస్తూ.. షూటింగ్ మొదలుకావడానికి ముందే హీరోయిన్ అనుకృతికి స్క్రిప్ట్, డైలాగ్స్ వినిపించామని, వాటిలో ఎలాంటి అసభ్యత లేదని, మొదట ఒప్పుకొని షూటింగ్ మధ్యలో ఇలా తప్పుకోవడం దారుణమని అన్నాడు. -
దర్శకుణ్ని తిట్టి వెళ్లిపోయిన హీరోయిన్‌పై కేసు!
-
హీరోయిన్ అనుకృతిపై కేసు!
హైదరాబాద్: ఏణ్నార్థం కిందట రామ్ గోపాల్ వర్మ ‘శ్రీదేవి’ అనే సినిమా రూపొందిస్తున్నట్లు ప్రకటించాడు గుర్తుందా.. ఆ సినిమాకు సంబంధించిన ప్రొమోస్ లో హాట్ హాట్ పోజులిచ్చి కుర్రకారు మతిపోగొట్టిన హీరోయిన్ అనుకృతి ఇప్పుడు మళ్లీ వార్తల్లోకెక్కింది. ప్రస్తుతం ఆమె ‘పాప’ అనే సినిమాలో లీడ్ రోల్ చేస్తోంది. ఒప్పందాలన్ని కుదిరి, తీరా షూటింగ్ మధ్యలో హీరోయిన్ అనుప్రియ తానీ సినిమా చేయబోనంటూ దర్శకనిర్మాతలకు ఝలక్ ఇచ్చింది. దీంతో ఆమెపై పోలీసులకు ఫిర్యాదుచేసేందుకు సిద్ధమయ్యాడు ‘పాప’ దర్శకుడు యోగి. ‘పాప’ సినిమాలో తన పాత్ర డైలాగ్స్ అసభ్యంగా ఉన్నయని, అలాంటివి తన ఇమేజ్ ను దెబ్బతీస్తాయని దర్శకుణ్ని తిట్టిపోస్తూ హీరోయిన్ అనుకృతి షూటింగ్ స్పాట్ నుంచి వెళ్లిపోయింది. షూటింగ్ ఆగిపోవడం వల్ల కలిగిన నష్టాన్ని నువ్వే భరించాలంటూ సినిమా నిర్మాత.. దర్శకుడు యోగిపై ఒత్తిడి పెంచారు. దీంతో ఎం చెయ్యాలో పాలుపోని ఆ దర్శకుడు చివరికి పోలీసులను ఆశ్రయించే ప్రయత్నంలో ఉన్నాడు. నిజానికి షూటింగ్ మొదలుకావడానికి ముందే హీరోయిన్ అనుకృతికి స్క్రిప్ట్, డైలాగ్స్ వినిపించామని, వాటిలో ఎలాంటి అసభ్యత లేదని, మొదట ఒప్పుకొని, షూటింగ్ మధ్యలో ఇలా తప్పుకోవడం దారుణమని దర్శకుడు యోగి అంటున్నారు. ఇప్పటివరకు షూట్ చేసిన సీన్ల తాలూకు రషెస్ తనకు తిరిగి ఇచ్చేస్తే రెమ్యునరేషన్ తరిగి ఇచ్చేస్తానని హీరోయిన్ అనుకృతి అంటున్నారని దర్శకుడు యోగి చెప్పారు. -
హీరోయిన్ అనుకృతిపై కేసు!