
కవిన్, అపర్ణాదాస్ జంటగా నటించిన తమిళ చిత్రం 'డా..డా'. గణేశ్ కె.బాబు దర్శకత్వం వహించిన ఈ చిత్రం తమిళంలో రూ. 40 కోట్లు వసూలు చేసింది. ఎన్నారై శ్రీమతి నీరజ కోట ఈ చిత్రాన్ని ‘పాపా’ పేరుతో తెలుగులో విడుదల చేశారు. పెళ్లికి ముందే హద్దులు దాటిన ఒక జంట జీవితంలో చోటు చేసుకున్న సంఘటనల ఆధారంగా ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు.
తాజాగా ఈ మూవీ ఓటీటీ సందడి చేసేందుకు వస్తోంది. ఈ అర్ధరాత్రి నుంచే ఆహా వేదికగా స్ట్రీమింగ్ కానుంది. జూలై 31 నుంచి స్ట్రీమింగ్ చేయనున్నట్లు ఓటీటీ సంస్థ సోషల్ మీడియా వేదికగా ప్రకటించింది. ఈ మేరకు పాపా మూవీ పోస్టర్ను పంచుకుంది. కాగా.. ఈ చిత్రంలో మోనిక చిన్నకోట్ల, ఐశ్వర్య, భాగ్యరాజ్, విటీవి గణేష్ ప్రధాన పాత్రల్లో నటించారు. తమిళంలో బ్లాక్ బస్టర్‌గా నిలిచిన డా.. డా సినిమాను మూవీ నీరజ సమర్పణలో పాన్ ఇండియా మూవీస్, జెకె ఎంటర్టైన్మెంట్స్ ఎంఎస్ రెడ్డి తెలుగులో రిలీజ్ చేశారు. ఇంకెందుకు ఆలస్యం ఈ మూవీని థియేటర్లలో చూడలేని వారు ఓటీటీలో చూసేయండి.