
తమిళ, మలయాళ, కన్నడ చిత్రాలకు తెలుగులో మంచి ఆదరణ ఉంది. అందుకే అక్కడ హిట్టయిన చిత్రాలన్నీ తెలుగులోనూ రలీజ్ అవుతుంటాయి. అలా తెలుగులో రిలీజ్ కాబోతున్న తమిళ బ్లాక్ బస్టర్ చిత్రమే డాడా. కవిన్, అపర్ణా దాస్ జంటగా నటించిన ఈ చిత్రం తమిళ్‌లో రిలీజై బ్లాక్ బస్టర్ హిట్‌గా నిలిచింది. ఇప్పుడు ఇదే చిత్రం తెలుగులో పాపా పేరుతో రిలీజ్ కాబోతుంది. ఈ చిత్రానికి గణేష్ కె బాబు దర్శకత్వం వహించారు. "పా పా" చిత్రాన్ని జేకే ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై నిర్మాత నీరజ కోట తెలుగు ఆడియెన్స్ ముందుకు తీసుకొస్తున్నారు. ఈ నెల 13న ఈ సినిమా గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు రెడీ అవుతోంది. మంగళవారం ఈ చిత్రం ట్రైలర్ ను ప్రముఖ దర్శకులు ఎ. కోదండరామిరెడ్డి, బి. గోపాల్ చేతుల మీదుగా రిలీజ్ చేశారు.

ఈ సందర్భంగా దర్శకుడు ఎ. కోదండరామిరెడ్డి మాట్లాడుతూ - ఈ చిత్రంలో హీరో హీరోయిన్స్ తో పాటు వారి బాబు పాత్రకు చాలా ఇంపార్టెన్స్ ఉన్నట్లు తెలుస్తోంది. మంచి ఎమోషనల్ ఫ్యామిలీ మూవీగా ప్రేక్షకుల్ని ఈ సినిమా ఆకట్టుకోవాలి కోరుకుంటున్నాను’ అన్నారు.
దర్శకుడు బి.గోపాల్ మాట్లాడుతూ -బడ్జెట్ లో చేసిన తమిళ చిత్రాలు కూడా తెలుగులో మంచి వసూళ్లు చేసిన సందర్భాలు ఉన్నాయి. "డా డా " సినిమా తమిళంలో 42 కోట్ల రూపాయలు వసూలు చేసింది. అలాగే తెలుగులో "పా పా" పేరుతో ఈ సినిమా రిలీజ్ అవుతోంది. సాంగ్స్ బాగున్నాయి, ట్రైలర్ ఆకట్టుకుంది. ఎమోషన్స్, ఫ్యామిలీ డ్రామా బాగున్నాయి. ఈ సినిమా మంచి విజయం సాధించి నిర్మాత నీరజ కోట గారికి పేరు, డబ్బు తీసుకురావాలని కోరుకుంటున్నా’ అన్నారు.
ప్రొడ్యూసర్ నీరజ కోట మాట్లాడుతూ - మా జేకే ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ మీద చేస్తున్న ఫస్ట్ మూవీ "పా పా". ఈ చిత్రం తమిళంలో"డా డా " పేరుతో రిలీజై ఘన విజయాన్ని సాధించింది. అలాంటి విజయమే తెలుగు ప్రేక్షకులు కూడా మాకు అందిస్తారని కోరుకుంటున్నా. ఈ రోజు మా మూవీ ట్రైలర్ లాంఛ్ కు వచ్చి సపోర్ట్ అందించిన డైరెక్టర్స్ కోదండరామిరెడ్డి గారికి, బి. గోపాల్ గారికి థ్యాంక్స్. అన్నారు.