ఉత్తరాంధ్ర జానపద కళాకారిణి రెడ్డి విజయ లక్ష్మి( గరివిడి లక్షి) జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన చిత్రం ‘గరివిడి లక్ష్మి’. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్పై టి.జి.విశ్వప్రసాద్, కృతి ప్రసాద్ నిర్మించిన ఈ చిత్రంలో ఆనంది ప్రధాన పాత్ర పోషించారు. గౌరీ నాయుడు దర్శకత్వం వహించారు. ఈ సినిమా ఇటీవల విడుదలై మంచి స్పందన అందుకుంది. తాజాగా సక్సెస్ మీట్ను చిత్రబృందం నిర్వహించింది.
ఈ కార్యక్రమంలో భావోద్వేగ సన్నివేశం చోటుచేసుకుంది. ప్రముఖ నటుడు షకలక శంకర్.. అసలైన గరివిడి లక్ష్మి కాళ్లపై పడి సాష్టాంగ నమస్కారం చేశారు. ఆమె కళను కొనియాడుతూ కన్నీటిపర్యంతమయ్యారు.
కళాకారులందరినీ ఆశీర్వదించు తల్లి..
‘మెగాస్టార్ చిరంజీవి డ్యాన్స్ తర్వాత అంతటి వేగం, ఉత్సాహంతో కూడిన నృత్యాన్ని గరివిడి లక్ష్మి ప్రదర్శనలోనే చూశాను. నిజమైన నృత్యం, స్వచ్ఛమైన జానపద కళ గురించి తెలుసుకోవాలంటే యూట్యూబ్లో లక్ష్మమ్మ బుర్రకథలు చూడాలి. కళాకారులను బతికించడానికే ఆ తల్లి ఇంకా మన మధ్య ఉంది. తెలుగు ప్రేక్షకులు ఉన్నంతకాలం ఆమె పేరు చిరస్థాయిగా నిలిచిపోతుంది’ అని భావోద్వేగంగా చెప్పారు. అనంతరం ‘మా కళాకారులందరినీ ఆశీర్వదించు తల్లీ’ అంటూ గరివిడి లక్ష్మి పాదాలకు నమస్కరించారు.
(ఇదీ చదవండి: నా ముఖం ఉబ్బినట్లు ఉందని.. ఏడాదిగా గ్యాలరీలో..: హీరోయిన్)
Watch Actor Shakalaka Shankar heartfelt speech at the #GarividiLakshmi Success Press Meet ✨ Book your tickets now! 🎟️ https://t.co/pCZrhVy8I1 @peoplemediafcy @vishwaprasadtg #KrithiPrasad @anandhiactress @smayurk @gowrinaidujammu @CharanArjunwave @ItsActorNaresh @AnkithKoyyaLive @sujithkolli #Raasi @Ananyabhat14 #SharanyaPradeep @kishorepolimera @BonguSathi @tseriessouth @shreyasgroup
— People Media Factory (@peoplemediafcy) October 17, 2026


