హీరోయిన్ అనుకృతిపై కేసు! | "papa" movie director Yogi to file a case against heroin Anukriti | Sakshi
Sakshi News home page

హీరోయిన్ అనుకృతిపై కేసు!

Jul 17 2016 5:31 PM | Updated on Aug 21 2018 6:21 PM

హీరోయిన్ అనుకృతిపై కేసు! - Sakshi

హీరోయిన్ అనుకృతిపై కేసు!

‘పాప’ సినిమాలో తన పాత్ర డైలాగ్స్ అసభ్యంగా ఉన్నయని, అలాంటివి తన ఇమేజ్ ను దెబ్బతీస్తాయని దర్శకుణ్ని తిట్టిపోస్తూ హీరోయిన్ అనుకృతి షూటింగ్ స్పాట్ నుంచి వెళ్లిపోయింది.

హైదరాబాద్: ఏణ్నార్థం కిందట రామ్ గోపాల్ వర్మ ‘శ్రీదేవి’ అనే సినిమా రూపొందిస్తున్నట్లు ప్రకటించాడు గుర్తుందా.. ఆ సినిమాకు సంబంధించిన ప్రొమోస్ లో హాట్ హాట్ పోజులిచ్చి కుర్రకారు మతిపోగొట్టిన హీరోయిన్ అనుకృతి ఇప్పుడు మళ్లీ వార్తల్లోకెక్కింది. ప్రస్తుతం ఆమె ‘పాప’ అనే సినిమాలో లీడ్ రోల్ చేస్తోంది. ఒప్పందాలన్ని కుదిరి, తీరా షూటింగ్ మధ్యలో హీరోయిన్ అనుప్రియ తానీ సినిమా చేయబోనంటూ దర్శకనిర్మాతలకు ఝలక్ ఇచ్చింది. దీంతో ఆమెపై పోలీసులకు ఫిర్యాదుచేసేందుకు సిద్ధమయ్యాడు ‘పాప’ దర్శకుడు యోగి.

‘పాప’ సినిమాలో తన పాత్ర డైలాగ్స్ అసభ్యంగా ఉన్నయని, అలాంటివి తన ఇమేజ్ ను దెబ్బతీస్తాయని దర్శకుణ్ని తిట్టిపోస్తూ హీరోయిన్ అనుకృతి షూటింగ్ స్పాట్ నుంచి వెళ్లిపోయింది. షూటింగ్ ఆగిపోవడం వల్ల కలిగిన నష్టాన్ని నువ్వే భరించాలంటూ సినిమా నిర్మాత.. దర్శకుడు యోగిపై ఒత్తిడి పెంచారు. దీంతో ఎం చెయ్యాలో పాలుపోని ఆ దర్శకుడు చివరికి పోలీసులను ఆశ్రయించే ప్రయత్నంలో ఉన్నాడు. నిజానికి షూటింగ్ మొదలుకావడానికి ముందే హీరోయిన్ అనుకృతికి స్క్రిప్ట్, డైలాగ్స్ వినిపించామని, వాటిలో ఎలాంటి అసభ్యత లేదని, మొదట ఒప్పుకొని, షూటింగ్ మధ్యలో ఇలా తప్పుకోవడం దారుణమని దర్శకుడు యోగి అంటున్నారు. ఇప్పటివరకు షూట్ చేసిన సీన్ల తాలూకు రషెస్ తనకు తిరిగి ఇచ్చేస్తే రెమ్యునరేషన్ తరిగి ఇచ్చేస్తానని హీరోయిన్ అనుకృతి అంటున్నారని దర్శకుడు యోగి చెప్పారు.

 

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement