
భారత ఈక్విటీలు శుక్రవారం లాభాల్లో ముగిశాయి. ఈ సెషన్ లో 52 వారాల గరిష్టాన్ని తాకాయి. దీపావళికి ముందు సెన్సెక్స్, నిఫ్టీ వరుసగా మూడు రోజులు లాభాలను అందుకున్నాయి.
బీఎస్ఈ సెన్సెక్స్ 484.53 పాయింట్లు లేదా 0.58 శాతం పెరిగి 83,952.19 వద్ద, ఎన్ఎస్ఈ నిఫ్టీ 124.55 పాయింట్లు లేదా 0.49 శాతం పెరిగి 25,709.85 వద్ద స్థిరపడ్డాయి.
బీఎస్ఈలో ఏషియన్ పెయింట్స్, ఎం అండ్ ఎం, భారతి ఎయిర్టెల్, హెచ్‌యూఎల్ టాప్ గెయినర్లలో ఉండగా, ఇన్ఫోసిస్, హెచ్‌ఎల్‌టెక్, ఎటర్నల్, టాటా స్టీల్ టాప్ లూజర్లలో ఉన్నాయి.
రంగాలవారీగా నిఫ్టీ ఎఫ్ఎంసిజి 1.37 శాతం లాభపడింది. నిఫ్టీ ఐటీ 1.63 శాతం, మీడియా 1.56 శాతం నష్టపోయాయి. విస్తృత మార్కెట్లలో, నిఫ్టీ మిడ్ క్యాప్ 100, స్మాల్ క్యాప్ 100 వరుసగా 0.57 శాతం, 0.05 శాతం నష్టపోయాయి.