
వినాయక చవితితో ఆగస్టు నెలాఖరులో ప్రారంభమైన పండుగ సీజన్ సెప్టెంబర్, అక్టోబర్ వరకు కొనసాగనుంది. ఈ నేపథ్యంలో చాలా మంది ఇన్వెస్టర్లు తదుపరి స్టాక్ మార్కెట్ సెలవుల గురించి ఆలోచిస్తున్నారు. సెప్టెంబర్ నెలలో ఏమైనా సెలవులు ఉన్నాయా.. ఎన్ని రోజులు ట్రేడింగ్ అందుబాటులో ఉంటుంది? అన్న సందేహాలుంటే ఈ కథనంలో తెలుసుకోండి.
గణేష్ చతుర్థి సందర్భంగా ఆగస్టు 27 బుధవారం స్టాక్ మార్కెట్‌కు సెలవు వచ్చింది. తదుపరి మార్కెట్ సెలవు సెప్టెంబర్ లో కాకుండా అక్టోబర్ లో వస్తుందని ఇన్వెస్టర్లు గమనించాలి. అయితే, రెగ్యులర్ వారాంతపు సెలవులను పరిగణనలోకి తీసుకుంటే, సెప్టెంబర్ నెలలో ఎనిమిది రోజులు భారత స్టాక్ మార్కెట్లో ట్రేడింగ్ అందుబాటులో ఉండదు.
వారాంతాలు మినహా అక్టోబర్ లో మూడు రోజుల పాటు ఎన్‌ఎస్ఈ, బీఎస్‌ఈ రెండు స్టాక్ ఎక్స్ఛేంజ్‌లు ట్రేడింగ్ కు మూతపడతాయని ఇన్వెస్టర్లు గమనించాలి. దసరా, దీపావళి, బలిప్రతిపాద వంటి పండుగ రోజులతో పాటు గాంధీ జయంతిని పురస్కరించుకుని జాతీయ సెలవు దినాలను ఈ సెలవుల్లో చూడవచ్చు.
రాబోయే స్టాక్ మార్కెట్ సెలవులు
2025లో మిగిలిన ఏడాది స్టాక్ మార్కెట్ సెలవులు ఎప్పుడున్నాయి.. ఏ రోజుల్లో ట్రేడింగ్ ఉండదో ఇక్కడ చూడండి..
అక్టోబర్ 2 గురువారం గాంధీ జయంతి
అక్టోబర్ 21 మంగళవారం దీపావళి
అక్టోబర్ 22 బుధవారం బలిప్రతిపాద
నవంబర్ 5 బుధవారం ప్రకాశ్ గురుపురబ్ గురునానక్ దేవ్
డిసెంబర్ 25 గురువారం క్రిస్మస్
ఇదీ చదవండి: హైదరాబాద్‌లో సెబీ ప్రత్యేక కార్యక్రమం