దేశీయ స్టాక్ మార్కెట్లు బుధవారం లాభాలలోకి వచ్చాయి. భారత బెంచ్ మార్క్ సూచీలు క్రితం రోజు నష్టాల నుంచి పుంజుకొని లాభాల్లో కదులుతున్నాయి. ఉదయం 9.30 సమయంలో బీఎస్ఈ సెన్సెక్స్ 298 పాయింట్లు లేదా 0.35 శాతం లాభపడి 84,885 వద్ద ఉండగా, నిఫ్టీ 50 సూచీ 100 పాయింట్లు లేదా 0.39 శాతం పెరిగి 25,985 వద్ద ట్రేడవుతున్నాయి.
టాటా మోటార్స్ పీవీ, ట్రెంట్, అదానీ పోర్ట్స్, టాటా స్టీల్, రిలయన్స్ ఇండస్ట్రీస్, ఎల్ అండ్ టీ, అల్ట్రాటెక్ సిమెంట్, ఇన్ఫోసిస్, మారుతి సుజుకీ, ఐసీఐసీఐ బ్యాంక్, టెక్ ఎం ఈరోజు సెన్సెక్స్ లో టాప్ గెయినర్లుగా నిలిచాయి. భారతీ ఎయిర్ టెల్, హెచ్‌యూఎల్, టీసీఎస్ మాత్రమే నష్టపోయాయి.
డిసెంబర్లో యూఎస్ ఫెడరల్ రిజర్వ్ రేటు తగ్గింపుపై మదుపరులు ఆశావాద దృక్పథంతో ప్రపంచ మార్కెట్లు వరుసగా మూడవ రోజు లాభాలను కలిగి ఉన్నాయి. విస్తృత మార్కెట్లలో నిఫ్టీ మిడ్ క్యాప్ ఇండెక్స్ 0.53 శాతం, నిఫ్టీ స్మాల్ క్యాప్ ఇండెక్స్ 0.79 శాతం పెరిగాయి.
రంగాలవారీగా నిఫ్టీ మెటల్ ఇండెక్స్ 1.7 శాతం లాభంతో ర్యాలీలో ముందంజలో ఉంది. నిఫ్టీ పీఎస్‌యూూ బ్యాంక్ ఇండెక్స్, ఐటీ, ఫైనాన్షియల్ సర్వీసెస్, ప్రైవేట్ బ్యాంక్ సూచీలు 0.8 శాతం వరకు లాభపడ్డాయి.
(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్‌సైట్‌లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.)


