గుజరాత్‌ను వెనక్కి నెట్టిన యూపీ.. కానీ టాప్‌లో మాత్రం..

Lifetime High Of Investors In Stock Market - Sakshi

భారత్‌ అభివృద్ధి చెందుతున్న దేశాల్లో ప్రధాన స్థానంలో ఉంది. దేశ ఆర్థికాభివృద్ధి ఏటా పెరుగుతోంది. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న సంస్థలు ఇండియా ఎకానమి గ్రోత్‌కు సంబంధించి పాజిటివ్‌ రేటింగ్‌ ఇస్తున్నారు. అందుకు అనువుగా స్టాక్‌మార్కెట్లు మరింత పుంజుకుంటున్నాయి.

కరోనా సమయంలో నిఫ్టీ సూచీ 8000 మార్కు వద్ద ఉండేది. ప్రస్తుతం 21,700 పాయింట్లతో జీవితకాల గరిష్ఠాన్ని చేరుతుంది. భారత్‌ వృద్ధిపై ఎలాంటి అనుమానం లేకుండా సమీప భవిష్యత్తులో మరింత పుంజుకుంటుందనే భావన బలంగా ఉంది. అందుకు తగ్గట్టుగానే దేశవ్యాప్తంగా చాలా మంది స్టాక్‌మార్కెట్లో మదుపు చేస్తున్నారు. తాజాగా నేషనల్‌ స్టాక్‌ ఎక్స్ఛేంజ్‌(ఎన్‌ఎస్‌ఈ) మదుపరుల డేటా విడుదల చేసింది. అందులోని వివరాలు ఈ కింది విధంగా ఉన్నాయి. 

దేశీయ స్టాక్‌మార్కెట్‌లో నమోదిత పెట్టుబడిదారుల సంఖ్య 2023లో భారీగా పెరిగింది. ఈ ఏడాదితో మదుపుదారుల సంఖ్య తొలిసారి 8 కోట్లకు చేరింది. గతేడాది డిసెంబర్‌ 31తో పోలిస్తే ఇన్వెస్టర్ల సంఖ్య 22.4 శాతం పెరిగింది. అత్యధిక స్టాక్‌ మార్కెట్‌ మదుపరులు కలిగిన రాష్ట్రంగా మహారాష్ట్ర అగ్రస్థానంలో నిలిచింది. అలాగే ఉత్తర్‌ప్రదేశ్‌ గుజరాత్‌ను అధిగమించింది. 89.47 లక్షల మదుపర్లతో యూపీ రెండో స్థానంలో నిలిచింది.

ఇదీ చదవండి: న్యూ బ్రాండ్ అంబాసిడ‌ర్‌గా దీపికా ప‌దుకొనె.. ఏ కంపెనీకంటే..

2022 డిసెంబరు 31 నాటికి దేశీయ స్టాక్‌ మార్కెట్‌లో పెట్టుబడులు పెట్టే  సంఖ్య 6.94 కోట్లుగా ఉండేది. ఈ ఏడాది డిసెంబరు 25 నాటికి ఆ సంఖ్య 8.49 కోట్లకు చేరింది. కేవలం ఎనిమిది నెలల్లోనే దాదాపు కోటిమందికి పైగా పెరిగారు. రాష్ట్రాల వారీగా చూస్తే 1.48 కోట్లతో మహారాష్ట్ర అగ్రస్థానంలో నిలిచింది. 89.47 లక్షలతో యూపీ రెండో స్థానంలో నిలవగా 76.68 లక్షల మదుపరులతో గుజరాత్ మూడో స్థానంలో ఉంది.

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top